Posts

Showing posts from December, 2008

అందం నా హక్కు...గోటికి తప్పదు రక్షణ..

Image
ఇంతకు ముందు విభాగంలో "చేతులకు సంబందించి తీసుకోవలసిన జాగ్రత్తలు" చూసాం. మరి గోళ్ళకు కూడా తగినంత రక్షణ అవసరం. ఈ క్రింది విదంగా ప్రయత్నించి చూడండి. గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉండాలన్నా,గోళ్ళపై పసుపుదనం పోవాలన్నా నిమ్మచెక్కతో రుద్దాలి. బలమైన గోళ్ళు మీ సొంతం కావాలంటే ఒక వెల్లుల్లి రేకను తీసుకొని గోళ్ళపై రుద్దాలి. ఇలా తరచు చేస్తుంటే గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి. గోళ్ళకు ఆరోగ్యంగా పెరగాలన్నా, అందమైన ఆకృతిలో ఉండాలన్నా నెలకొకసారైనా "మెనిక్యూర్" చేయాలి. గోరు వెచ్చనినీటిలో 4-5 చుక్కల షాంపూ కాని, కొంచం సబ్బు కాని వేసి చేతులను 10-15 ని.// నాననివ్వాలి. తరువాత చేతులను బయటకు తీసి చేతులను, వేళ్ళను, గోళ్ళను మెత్తని బ్రష్ తో రుద్ది కడగాలి. క్యూటికల్ కటర్ తో గోరు చుట్టూ ఉండే డెడ్ స్కిన్ ను తొలగించాలి. క్యూటికల్ కటర్ విడిగా కొనుక్కోవచ్చు లేదా నెయిల్ కటర్ తో పాటు వచ్చే క్యూటికల్ కటర్ను వాడవచ్చు. ఇది నెయిల్ కటర్ చివర వంపు తిరిగి ఉండే సాదనం.దీనితో క్యూటికల్స్ కట్ చేసిన తర్వాత గోరు వెంబడి ఉండి గోరు మీద పరుచుకున్నట్ట్లు ఉండే చర్మాన్ని లోపలికి పుష్ చేయాలి. తరువాత గోరును అందంగా షేప్ కట్

అందం నా హక్కు.... కోమలమైన చేతులకోసం.

Image
శరీరంలో ముఖం తరువాత అందరూ గమనించేది చేతులను. ముఖ్యంగా స్త్రీలు ఇంటి పనులు, వంట పనులు చేయడం వలన చేతులు చాలా కఠినంగా తయారవుతాయి. మరి చేతులను కోమలంగా తయారుచేసుకోవడానికి ఈ క్రింది చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించాలి. ఈ మిశ్రమం చేతులపై ఉండే మృత కణాలను, పొడి చర్మాన్ని తొలగించి చేతులను సున్నితంగా చేస్తుంది. ఒక గిన్నె లేక వెడల్పుగా ఉన్న పాత్రలో నీళ్ళు పోసి, దానిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముంజేతి నుండి భుజాల వరకు రాయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి. ఇల చేయడం వలన చేతులు మృదువుగా మారతాయి. అరచేతులు పొడిబారినట్టయితే రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో చేతులను, చేతి వేళ్ళను బాగా మర్ధనా చేయాలి. ఇలా చేయడం వలన చేతులకు వ్యాయామం కలిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దన్యవాదములు...