అందం నా హక్కు.... కోమలమైన చేతులకోసం.
శరీరంలో ముఖం తరువాత అందరూ గమనించేది చేతులను. ముఖ్యంగా స్త్రీలు ఇంటి పనులు, వంట పనులు చేయడం వలన చేతులు చాలా కఠినంగా తయారవుతాయి. మరి చేతులను కోమలంగా తయారుచేసుకోవడానికి ఈ క్రింది చిట్కాలను ప్రయత్నించి చూడండి.
- ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించాలి. ఈ మిశ్రమం చేతులపై ఉండే మృత కణాలను, పొడి చర్మాన్ని తొలగించి చేతులను సున్నితంగా చేస్తుంది.
- ఒక గిన్నె లేక వెడల్పుగా ఉన్న పాత్రలో నీళ్ళు పోసి, దానిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముంజేతి నుండి భుజాల వరకు రాయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి. ఇల చేయడం వలన చేతులు మృదువుగా మారతాయి.
- అరచేతులు పొడిబారినట్టయితే రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో చేతులను, చేతి వేళ్ళను బాగా మర్ధనా చేయాలి. ఇలా చేయడం వలన చేతులకు వ్యాయామం కలిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
దన్యవాదములు...
Comments
Vivek
అరుణ.