అందం నా హక్కు...గోటికి తప్పదు రక్షణ..

ఇంతకు ముందు విభాగంలో "చేతులకు సంబందించి తీసుకోవలసిన జాగ్రత్తలు" చూసాం. మరి గోళ్ళకు కూడా తగినంత రక్షణ అవసరం. ఈ క్రింది విదంగా ప్రయత్నించి చూడండి.

  • గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉండాలన్నా,గోళ్ళపై పసుపుదనం పోవాలన్నా నిమ్మచెక్కతో రుద్దాలి.

  • బలమైన గోళ్ళు మీ సొంతం కావాలంటే ఒక వెల్లుల్లి రేకను తీసుకొని గోళ్ళపై రుద్దాలి. ఇలా తరచు చేస్తుంటే గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి.

  • గోళ్ళకు ఆరోగ్యంగా పెరగాలన్నా, అందమైన ఆకృతిలో ఉండాలన్నా నెలకొకసారైనా "మెనిక్యూర్" చేయాలి.

  • గోరు వెచ్చనినీటిలో 4-5 చుక్కల షాంపూ కాని, కొంచం సబ్బు కాని వేసి చేతులను 10-15 ని.// నాననివ్వాలి. తరువాత చేతులను బయటకు తీసి చేతులను, వేళ్ళను, గోళ్ళను మెత్తని బ్రష్ తో రుద్ది కడగాలి.

  • క్యూటికల్ కటర్ తో గోరు చుట్టూ ఉండే డెడ్ స్కిన్ ను తొలగించాలి. క్యూటికల్ కటర్ విడిగా కొనుక్కోవచ్చు లేదా నెయిల్ కటర్ తో పాటు వచ్చే క్యూటికల్ కటర్ను వాడవచ్చు. ఇది నెయిల్ కటర్ చివర వంపు తిరిగి ఉండే సాదనం.దీనితో క్యూటికల్స్ కట్ చేసిన తర్వాత గోరు వెంబడి ఉండి గోరు మీద పరుచుకున్నట్ట్లు ఉండే చర్మాన్ని లోపలికి పుష్ చేయాలి.

  • తరువాత గోరును అందంగా షేప్ కట్ చేయాలి. ఎక్కువమందికి ఓవెల్ షేప్ నప్పుతుంది. కొంతమందికి ఫ్లాట్ షేప్ కుదురుతుంది. వేలు తీరును బట్టి ఏది నప్పుతుందో చూసుకోవాలి. ముందుగా ఒక వేలికు ఓవెల్ షేప్ కట్ చేసి చూసుకోని నప్పలేదనిపిస్తే ఫ్లాట్ షేప్ చేసుకోవచ్చు. గోరును షేప్ చేసెటప్పుడు మొదటిగా మద్యలో కట్ చేయాలి. తరువాత పక్కల కట్ చేయాలి మరీ పొడవుగా వుండేటప్పుడు ఒకేసారి లోపలికి కట్ చేయకూడదు కొద్ది కొద్దిగా కట్ చేస్తూ పొట్టిగా చేయాలి .

  • షేప్ చేసిన తరువాత గోరును ఫైలర్తో రుద్దాలి. ఫైలెర్ కూడా నైల్ కటర్లోనే వుంటుంది(చాకులాగ ఉండి సన్నని నొక్కులుండే సాదనం). దీనితో రిద్దితే గోరుకు ఉన్న గరుకుతనం పోయి నునుపు వస్తుంది.

  • ఇప్పుడు గోళ్ళకు మసాజ్ ఆయిల్ కాని, లోషన్ కాని రాసి మరొక చేతి బొటనివేళితో గోరుమీద వలయాకారంలో తిప్పుతూ ప్రతీ గోరుకూ విడిగా మర్దనా చేయాలి. గోళ్ళకు పూర్తయ్యాక వేళ్ళకు ప్రతీ కణుపుకూ మర్దనా చేయాలి ఒక చేతికి మరొక చేతితో అలా రెండు చేతులకూ మర్దనా చేసుకోవాలి.

దన్యవాదములు...

Comments

Unknown said…
Good noon srisatya sir! Previously I heared about “manicure” but I donnot , how to apply for the nails.now i am able to understand what is manicure and its uses. thanks for posting such a useful and informative TIPS for the people.keep posting.
Unknown said…
నమస్కారం శ్రీసత్య గారు!"గోటికి కూడా రక్షణ కావాలని.." చాలా చక్కగా వివరించారు.
Sravya V said…
Nice info ! but I like your comments rather than your posts :)
Unknown said…
Namaskaaram annayya, neenu eeppudu anukune vaadini nail cutterlo enduku anni parts vuntaaya ani. Chaala mandini adigaanu kuudaa vaati gurinchi teliyadannaru.aa doubt naalo alane vundi poyindi.ippudu naa sandeaham tirindi.

vivek
Unknown said…
Annayya! what happend to you? chaalaa roojula nundi posts cheyadam ledu. hope twaraloane neenu mee site lo manchi posts chudaalanukuntunnanu.

vivek
GARAM CHAI said…
thanks for beauty tips
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

Popular posts from this blog

కడుపులో కన్నీళ్ళను ఎందుకు దాచుకోవడం...?

అందం నా హక్కు....చర్మ సౌందర్యం కాపాడుకోండిలా.

అందం నా హక్కు.... కోమలమైన చేతులకోసం.