నన్ను చేరు నేస్తమా...!
మమతలు మురిసే వేళ, ఆశలు చిగురించే వేళ, సూర్యుడు ఉదయించే వేళ, చంద్రుడు వెన్నెల పంచే వేళ,
నీ రూపం చూసాను, పరవళ్ళు తొక్కాను, ఆనందించాను, మైమరచిపోయాను. నా స్నేహం స్వీకరిస్తావని, నాతో చేయి కలుపుతావని, కానీ నా కోర్కె తీర్చకుండానే వెల్లిపోయావు.
ఇది నీకు న్యాయమా!!
నేను జీవించేది నీ గురించి, అందుకే నాలో బాదను నీకు పంపుతున్న నా మది భిగించి, నా మనసు మారింది ముత్యంలా నిన్ను స్మరించి, నీకు అవుతా మంచి నేస్తంలా శిరసువంచి, నాకోసం రాలేవా ఈ దూరాన్ని ఇక తెంచి!!
నీ నవ్వులో తెల్లదనం నా గుండెకు కలిగించే వెచ్చదనం,
నీ చూపులో చల్లదనం నా మదికి కలిగించే పచ్చదనం,
నీ మనసులో మంచితనం నా యదకు కలిగించే తడిదనం,
నీ అధరంలో ఎర్రదనం నా హృదయానికి కలిగించే వెలుగుదనం,
నీ స్నేహంలో చిలిపితనం నా ఊపిరికి కలిగించే సొగసుదనం.
నువ్వు నన్ను చేరితే ......
నీలి మేఘాల సాక్షిగా నీ చూపునవుతా,నయగారాల సాక్షిగా నీ మాటనవుతా, నింగి చుక్కల సాక్షిగా నీ నడకనవుతా,నీ తోడు సాక్షిగా నీ నీడ సాక్షిగా నీ నీడను అవుతా!!
వసంతం కోసం పక్షులు ఎదురు చూసినట్లు, వాన కోసం వాగులు ఎదురుచూసినట్లు, నీ కోసం ఎదురుచూస్తున్నా "ఆశగా" నువ్వు చేరాలి నన్ను "శ్వాసగా".
చివరిగా,
"ఎదురు చూసి అలసింది ఈ దేహం ! నువ్వు రాకుంటే చేరును నన్ను అ మరణం!!"
దన్యవాదములు.....
Comments
మంచి కవిత
"నేను జీవించేది నీ గురించి, అందుకే నాలో బాదను నీకు పంపుతున్న నా మది భిగించి, నా మనసు మారింది ముత్యంలా నిన్ను స్మరించి, నీకు అవుతా మంచి నేస్తంలా శిరసువంచి, నాకోసం రాలేవా ఈ దూరాన్ని ఇక తెంచి!!"
ee line super annayya.
vivek.
@గురువు(బాబా)గారికి,నా ప్రత్యేక దన్యవాదములు...
@అమృత గారికి,
@లక్ష్మి గారికి,
@స్టెల్లా గారికి నా రచనలను అదరించినందుకు కృతఙ్ఞతలు...
@విద్య గారికి,
@వివేక్ గారికి ఆఫిసులో పనుల వలన ఈ మద్య బయటకు వెళ్ళవలసి వస్తుందండి ఇకపైన నా రచనల మద్యన దూరం రాకుండా చూసుకుంటాను...
@ నీలాంచల గారికి ఇకపై ఇలంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటానండి...
అందరికి మరోక్కసారి కృతఙ్ఞతలు....
మీ శ్రీసత్య...
అరుణ.