అందం నా హక్కు.. శీతాకాలంలో చర్మ సంరక్షణ - II
ఇంతకు ముందు విభాగంలో "అందం నా హక్కు.. శీతాకాలంలో చర్మ సంరక్షణ - II" లో "రోజ్ కోల్డ్ క్రీం" తయారి విధానం తెలుసుకున్నాం.ఇప్పుడు "రోజ్ హ్యాండ్ లోషన్ మరియు రోజ్ రూట్ వాటర్" తయారుచేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.
"రోజ్ రూట్ వాటర్":
రోజ్ హ్యాండ్ లోషన్:
కావలసిన పదార్దాలు మరియు తయారి విధానం:
- పన్నీరు -3 టేబుల్ స్పూన్స్,
- గ్లిజరిన్-3 టేబుల్ స్పూన్స్,
- ఆల్కహాల్-3 టేబుల్ స్పూన్స్,
- నిమ్మ రసం-1 టేబుల్ స్పూన్,
- కమలా పండు రసం-1 టేబుల్ స్పూన్,
- వెనీగర్- 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ ఒక బోటల్లో వేసి బాగా కలియబెట్టాలి. అంతే "రోజ్ హ్యాండ్ లోషన్" రెడీ దీనిని ఏ సీజన్ లోనైనా వాడవచ్చు.
"రోజ్ రూట్ వాటర్":
కావలసిన పదార్దాలు మరియు తయారి విధానం:
గులాభి మొక్క వేరును చిదిమి ఒక పాత్రలో వేసి తగినన్ని నీటిని వేసిమూత పెట్టి చిన్న మంట మీద ఒక గంట సేపు మరిగించాలి. చల్లారిన తరువాత ఆ నీటిని ఒక బాటిల్ లో వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని వాడుకోవచ్చు. ఇది జిడ్డు చర్మానికి బాగా పని చేస్తుంది. ఈవాటర్ ని ఒక కప్పు లోనికి తీసుకుని దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది.
దన్యవాదములు...
Comments
@ అమృత గారికి ధన్యవాదములు...
@ విద్య గారికి... మంచి ప్రశ్న వేసారు. ఆల్కహాల్ ఉపయోగించడం వలన ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. ఈ రకమైన ఆల్కహాల్ ఎక్కువగా అన్ని సౌందర్య లేపనాలలో ఉపయోగించడం సర్వసాధారణం. అందువలన వీటిని ఉపయోగించడం వలన ఏ సమస్యలు రావు. వీటిని బార్లలోనే కాకుండా అన్ని ప్రధాన దుకాణాలలో అమ్ముతారు.
@ Anonymous గారికి కూడా దన్యవాదములు...
మీ శ్రీసత్య...
అరుణ.