అందం నా హక్కు....కురుల సంరక్షణ-VI.
కురులకు సంబంధించి సంరక్షణ కలిగించే మరికొన్ని సులువైన,విలువైన మర్గాలు వీటిని కూడా ప్రయత్నించి చూడండి.
కురులకు "జీవం పోయండి ఇలా"...
- పాల కూర ఆకులను గ్రైండ్ చేసి దానితో తల రుద్దుకుంటే నిర్జీవంగా ఉన్న జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.
- కోడి గుడ్డు తెల్లసొన,రెండు స్పూన్ల ఆముదం,ఒక స్పూన్ గ్లిజరిన్ కలిపి తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తే తల నిగనిగలాడుతుంది.
- దోసె పిండిని జుట్టుకు పట్టించి 15 ని " తరువాత తలస్నానం చేస్తే నిగనిగలాడుతుంది.
- తాజా కొత్తిమీర రసం జుట్టుకు పట్టించడం వలన నిగారింపు వస్తుంది.
- కురులు సాఫ్ట్ గా మారాలంటే 5 స్పూన్ల తేనని తలకు పట్టించి 20 ని" - 30 ని " తరువాత శుభ్రపరచుకోవాలి.
కురులు పట్టులా మారాలంటే?...
- వారానికి ఒకసారి కొబ్బరినీటితో తలరుద్దుకుని తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో తలంటుకుంటే కురులు పట్టులా మారుతాయి.
- వెచ్చటి కొబ్బరినూనెతో తలకు మర్దనా చేసి తరువాత తలకు వేడి నీటిలో ముంచిన టవల్ చుట్టి గంట సేపు ఉంచి తరువాత తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా మారుతుంది.
- ఉడికించిన మినగపప్పు, మెంతి ఆకులను రుబ్బి వారానికి 2-3 సార్లు తల కుదుళ్ళకు పట్టిస్తే తల పెరగడమే కాకుండా పట్టులా మారుతుంది.
దన్యవాదములు...
Comments
అరుణ.