అందం నా హక్కు.. శీతాకాలంలో చర్మ సం రక్షణ...
ఈ శీతాకాలంలో కోల్డ్ క్రీంస్, మాయిశ్చురైజర్స్ ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక వాటిని ఉపయోగించనివారు (అంటే అవి పడకో లేక వాటివలన ఇతర చర్మ వ్యాధులు వస్తాయనే అపోహ ఉన్నవారు) ఉంటారు. ఇలాంటి వారి కోసం ఈ "రోజ్ కోల్డ్ క్రీం" ప్రయత్నించి చూడండి.
రోజ్ కోల్డ్ క్రీం:
కావలసిన పదార్దాలు:
రోజ్ కోల్డ్ క్రీం:
కావలసిన పదార్దాలు:
- ఆలివ్ ఆయిల్-4 టేబుల్ స్పూన్స్,
- గులాభి రెక్కలు - తాజాగా ఉండేవి,
- బిస్ వ్యాక్స్ -1 టేబుల్ స్పూన్ (అన్ని ప్రముఖ దుకాణాలలో దొరుకుతుంది),
- స్వచ్చమైన నీరు- తగినంత.
తయారు చేసే విదానం :
ఆలివ్ ఆయిల్ ని బాగా మరిగించి దానిని ఒక గాజు సీసా/పాత్రలో వేసుకోవాలి. అందులో గులాభి రెక్కలను వేసి గాలిబయటకు పోకుండా మూత బిగించాలి. దానిని ఒక వారం రోజులు అలానే ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడపోసి గులాభి రెక్కలను వేరు చేయాలి. ఇప్పుడు గులాభి సుగంధం వెదజల్లే ఆలివ్ ఆయిల్ మిగులుతుంది. ఇప్పుడు మరొకపాత్రలో బీన్ వ్యాక్స్ తీసుకుని బాగా కరిగే వరకు వేడి చేయాలి. కరిగినాక సుగంధంకల ఆలివ్ ఆయిల్ ని కలిపి పాత్రను కిందకు దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత కొద్దిగా నీటిని కలిపితే "రోజ్ కోల్డ్ క్రీం" రెడీ. దీనిని ఒక బాటల్ లో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
దన్యవాదములు...
Comments
అరుణ.
@ Anonymous గారికి చాలా చాలా దన్యవాదములు. ఎందుకంటే గత నా ప్రచురణలకు నెగటివ్ గా స్వీకరించారు. దీనికి మీరు కొంచంలో,కొంచం పాజిటివ్ గా కామెంట్ ఇచ్చారు.
@ అమృత గారికి, ఆ "బిస్ వ్యాక్స్" అంటే అది ఒక మైనంలా ఉండే పదార్ధం. ఇది అన్ని ప్రముఖ షాపుల్లో దొరుకుతుంది.
దన్యవాదములు.
మీ శ్రీసత్య...
@ నవ కవిత గారికి, ఈ క్రీం అందరికోసమండి. పెద్ద,చిన్న,స్త్రీలు,పురుషులు అందరూ నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు.
@ అరుణ గారికి, దీనికి ప్రక్క చిత్రంలో చూపించిన లేత గులాభిరంగు (BABY PINK)గల పూలను ఉపయోగించవచ్చు.
@ సాయి కృష్ణ గారికి,
@ శాంతి రాజు గారికి, కూడా దన్యవాదములు....
మీ శ్రీసత్య...
Vivek & batch.
Olive Oil vediga vundagane rolse petals andulo veyyala? samdeham teerchandi please
@ వివేక్ గారికి తప్పకుండా నా సాహిత్యాన్ని ప్రచురిస్తాను.గత 3 ప్రచురణలు టిప్స్ కి సంబందించినవే పెట్టడం ఎందుకు జరిగిందంటే చలికాలంలో అడుగుపెట్టం కదండి చర్మసమస్యలు పెరుగుతాయనే ఉద్దేస్యంతోనె గమనించగలరు.
@ చైతన్య గారికి, ఆయుర్వేదంలో తయరు చేసుకునె చిట్కాలలొ మరిగించడం అంటే అతి చిన్న నిప్పుపైనా లేదా మంట పైనే మరిగించాలి లేదంటే అందులో ఔషద గుణాలు హరించుకుపోతాయి..అలానే మరిగించిన దానిలో మరొక ములకం లేదా ఔషద గుణాలు కలిగిన పదార్ధాన్ని కలిపేటప్పుడు గోరువేచ్చగా ఉన్న దానిలోనే కలపి జగ్రత్తచేసుకోవాలి...
దన్యవాదములు.
మీ శ్రీసత్య...
అరుణ.