నన్ను చేరు నేస్తమా...!
ప్రియ నేస్తమా! నా మౌనాల ఆరంభమా!! మమతలు మురిసే వేళ, ఆశలు చిగురించే వేళ, సూర్యుడు ఉదయించే వేళ, చంద్రుడు వెన్నెల పంచే వేళ, నీ రూపం చూసాను, పరవళ్ళు తొక్కాను, ఆనందించాను, మైమరచిపోయాను. నా స్నేహం స్వీకరిస్తావని, నాతో చేయి కలుపుతావని, కానీ నా కోర్కె తీర్చకుండానే వెల్లిపోయావు. ఇది నీకు న్యాయమా!! నేను జీవించేది నీ గురించి, అందుకే నాలో బాదను నీకు పంపుతున్న నా మది భిగించి, నా మనసు మారింది ముత్యంలా నిన్ను స్మరించి, నీకు అవుతా మంచి నేస్తంలా శిరసువంచి, నాకోసం రాలేవా ఈ దూరాన్ని ఇక తెంచి!! నీ నవ్వులో తెల్లదనం నా గుండెకు కలిగించే వెచ్చదనం, నీ చూపులో చల్లదనం నా మదికి కలిగించే పచ్చదనం, నీ మనసులో మంచితనం నా యదకు కలిగించే తడిదనం, నీ అధరంలో ఎర్రదనం నా హృదయానికి కలిగించే వెలుగుదనం, నీ స్నేహంలో చిలిపితనం నా ఊపిరికి కలిగించే సొగసుదనం. నువ్వు నన్ను చేరితే ...... నీలి మేఘాల సాక్షిగా నీ చూపునవుతా,నయగారాల సాక్షిగా నీ మాటనవుతా, నింగి చుక్కల సాక్షిగా నీ నడకనవుతా,నీ తోడు సాక్షిగా నీ నీడ సాక్షిగా నీ నీడను అవుతా!! వసంతం కోసం పక్షులు ఎదురు చూసినట్లు, వాన కోసం వాగులు ఎదురుచూసినట్లు, నీ కోసం ఎదురుచూస్తున్నా "ఆశగా...