Posts

అందం నా హక్కు...గోటికి తప్పదు రక్షణ..

Image
ఇంతకు ముందు విభాగంలో "చేతులకు సంబందించి తీసుకోవలసిన జాగ్రత్తలు" చూసాం. మరి గోళ్ళకు కూడా తగినంత రక్షణ అవసరం. ఈ క్రింది విదంగా ప్రయత్నించి చూడండి. గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉండాలన్నా,గోళ్ళపై పసుపుదనం పోవాలన్నా నిమ్మచెక్కతో రుద్దాలి. బలమైన గోళ్ళు మీ సొంతం కావాలంటే ఒక వెల్లుల్లి రేకను తీసుకొని గోళ్ళపై రుద్దాలి. ఇలా తరచు చేస్తుంటే గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి. గోళ్ళకు ఆరోగ్యంగా పెరగాలన్నా, అందమైన ఆకృతిలో ఉండాలన్నా నెలకొకసారైనా "మెనిక్యూర్" చేయాలి. గోరు వెచ్చనినీటిలో 4-5 చుక్కల షాంపూ కాని, కొంచం సబ్బు కాని వేసి చేతులను 10-15 ని.// నాననివ్వాలి. తరువాత చేతులను బయటకు తీసి చేతులను, వేళ్ళను, గోళ్ళను మెత్తని బ్రష్ తో రుద్ది కడగాలి. క్యూటికల్ కటర్ తో గోరు చుట్టూ ఉండే డెడ్ స్కిన్ ను తొలగించాలి. క్యూటికల్ కటర్ విడిగా కొనుక్కోవచ్చు లేదా నెయిల్ కటర్ తో పాటు వచ్చే క్యూటికల్ కటర్ను వాడవచ్చు. ఇది నెయిల్ కటర్ చివర వంపు తిరిగి ఉండే సాదనం.దీనితో క్యూటికల్స్ కట్ చేసిన తర్వాత గోరు వెంబడి ఉండి గోరు మీద పరుచుకున్నట్ట్లు ఉండే చర్మాన్ని లోపలికి పుష్ చేయాలి. తరువాత గోరును అందంగా షేప్ కట్...

అందం నా హక్కు.... కోమలమైన చేతులకోసం.

Image
శరీరంలో ముఖం తరువాత అందరూ గమనించేది చేతులను. ముఖ్యంగా స్త్రీలు ఇంటి పనులు, వంట పనులు చేయడం వలన చేతులు చాలా కఠినంగా తయారవుతాయి. మరి చేతులను కోమలంగా తయారుచేసుకోవడానికి ఈ క్రింది చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించాలి. ఈ మిశ్రమం చేతులపై ఉండే మృత కణాలను, పొడి చర్మాన్ని తొలగించి చేతులను సున్నితంగా చేస్తుంది. ఒక గిన్నె లేక వెడల్పుగా ఉన్న పాత్రలో నీళ్ళు పోసి, దానిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముంజేతి నుండి భుజాల వరకు రాయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి. ఇల చేయడం వలన చేతులు మృదువుగా మారతాయి. అరచేతులు పొడిబారినట్టయితే రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో చేతులను, చేతి వేళ్ళను బాగా మర్ధనా చేయాలి. ఇలా చేయడం వలన చేతులకు వ్యాయామం కలిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దన్యవాదములు...

నన్ను చేరు నేస్తమా...!

Image
ప్రియ నేస్తమా! నా మౌనాల ఆరంభమా!! మమతలు మురిసే వేళ, ఆశలు చిగురించే వేళ, సూర్యుడు ఉదయించే వేళ, చంద్రుడు వెన్నెల పంచే వేళ, నీ రూపం చూసాను, పరవళ్ళు తొక్కాను, ఆనందించాను, మైమరచిపోయాను. నా స్నేహం స్వీకరిస్తావని, నాతో చేయి కలుపుతావని, కానీ నా కోర్కె తీర్చకుండానే వెల్లిపోయావు. ఇది నీకు న్యాయమా!! నేను జీవించేది నీ గురించి, అందుకే నాలో బాదను నీకు పంపుతున్న నా మది భిగించి, నా మనసు మారింది ముత్యంలా నిన్ను స్మరించి, నీకు అవుతా మంచి నేస్తంలా శిరసువంచి, నాకోసం రాలేవా ఈ దూరాన్ని ఇక తెంచి!! నీ నవ్వులో తెల్లదనం నా గుండెకు కలిగించే వెచ్చదనం, నీ చూపులో చల్లదనం నా మదికి కలిగించే పచ్చదనం, నీ మనసులో మంచితనం నా యదకు కలిగించే తడిదనం, నీ అధరంలో ఎర్రదనం నా హృదయానికి కలిగించే వెలుగుదనం, నీ స్నేహంలో చిలిపితనం నా ఊపిరికి కలిగించే సొగసుదనం. నువ్వు నన్ను చేరితే ...... నీలి మేఘాల సాక్షిగా నీ చూపునవుతా,నయగారాల సాక్షిగా నీ మాటనవుతా, నింగి చుక్కల సాక్షిగా నీ నడకనవుతా,నీ తోడు సాక్షిగా నీ నీడ సాక్షిగా నీ నీడను అవుతా!! వసంతం కోసం పక్షులు ఎదురు చూసినట్లు, వాన కోసం వాగులు ఎదురుచూసినట్లు, నీ కోసం ఎదురుచూస్తున్నా "ఆశగా...

అందం నా హక్కు....కురుల సంరక్షణ-VI.

Image
కురులకు సంబంధించి సంరక్షణ కలిగించే మరికొన్ని సులువైన,విలువైన మర్గాలు వీటిని కూడా ప్రయత్నించి చూడండి. కురులకు "జీవం పోయండి ఇలా"... పాల కూర ఆకులను గ్రైండ్ చేసి దానితో తల రుద్దుకుంటే నిర్జీవంగా ఉన్న జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది. కోడి గుడ్డు తెల్లసొన,రెండు స్పూన్ల ఆముదం,ఒక స్పూన్ గ్లిజరిన్ కలిపి తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తే తల నిగనిగలాడుతుంది. దోసె పిండిని జుట్టుకు పట్టించి 15 ని " తరువాత తలస్నానం చేస్తే నిగనిగలాడుతుంది. తాజా కొత్తిమీర రసం జుట్టుకు పట్టించడం వలన నిగారింపు వస్తుంది. కురులు సాఫ్ట్ గా మారాలంటే 5 స్పూన్ల తేనని తలకు పట్టించి 20 ని" - 30 ని " తరువాత శుభ్రపరచుకోవాలి. కురులు పట్టులా మారాలంటే?... వారానికి ఒకసారి కొబ్బరినీటితో తలరుద్దుకుని తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో తలంటుకుంటే కురులు పట్టులా మారుతాయి. వెచ్చటి కొబ్బరినూనెతో తలకు మర్దనా చేసి తరువాత తలకు వేడి నీటిలో ముంచిన టవల్ చుట్టి గంట సేపు ఉంచి తరువాత తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా మారుతుంది. ఉడికించిన మినగపప్పు, మెంతి ఆకులను రుబ్బి వారానికి 2-3 సార్లు తల కుదుళ్ళకు పట్టి...

అందం నా హక్కు.. శీతాకాలంలో చర్మ సంరక్షణ - II

Image
ఇంతకు ముందు విభాగంలో "అందం నా హక్కు.. శీతాకాలంలో చర్మ సంరక్షణ - II" లో "రోజ్ కోల్డ్ క్రీం" తయారి విధానం తెలుసుకున్నాం.ఇప్పుడు "రోజ్ హ్యాండ్ లోషన్ మరియు రోజ్ రూట్ వాటర్" తయారుచేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. రోజ్ హ్యాండ్ లోషన్: కావలసిన పదార్దాలు మరియు తయారి విధానం: పన్నీరు -3 టేబుల్ స్పూన్స్, గ్లిజరిన్-3 టేబుల్ స్పూన్స్, ఆల్కహాల్-3 టేబుల్ స్పూన్స్, నిమ్మ రసం-1 టేబుల్ స్పూన్, కమలా పండు రసం-1 టేబుల్ స్పూన్, వెనీగర్- 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ ఒక బోటల్లో వేసి బాగా కలియబెట్టాలి. అంతే "రోజ్ హ్యాండ్ లోషన్" రెడీ దీనిని ఏ సీజన్ లోనైనా వాడవచ్చు. "రోజ్ రూట్ వాటర్": కావలసిన పదార్దాలు మరియు తయారి విధానం: గులాభి మొక్క వేరును చిదిమి ఒక పాత్రలో వేసి తగినన్ని నీటిని వేసిమూత పెట్టి చిన్న మంట మీద ఒక గంట సేపు మరిగించాలి. చల్లారిన తరువాత ఆ నీటిని ఒక బాటిల్ లో వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని వాడుకోవచ్చు. ఇది జిడ్డు చర్మానికి బాగా పని చేస్తుంది. ఈవాటర్ ని ఒక కప్పు లోనికి తీసుకుని దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది. దన్యవాదములు...

ఓ జాలిలేని నేస్తమా... !

Image
ఈ విరహానికి అర్దం తెలిపేది నీవే కదా! ఈ ఎడబాటుకి భావం తెలిపేది నీవే కదా! తెలుపమా నా ప్రాణమా, కన్నె హృదయం విలవిలలాడుతుంది. చూపుమా ఓ నేస్తమా, కన్నె వయసు భాదలో అలపిస్తుంది. కనులకు తెలియని కావ్యాలే కదలుగా మారెలే, మాటలకందని ముత్యాలే మదురిమలాయెలే, ఎదురుగా ఉంటూ యెద బాద వినవా గీతమా, ఎదురై వచ్చి యదలోనే కొలువుండు సంగీతమా! కన్నులు తెరిస్తే జననం అని, కన్నులు మూస్తే మరణం అని, తెరిచి తెరియని కనులను చూపడం న్యాయమా! నిప్పుల వెంట తియ్యని వల, విషమును చిమ్మే కమ్మని కల, రెంటిని కలిపి ఒకదానిలా చూపడం ధర్మమా!! నిమిషానికి ఒకటైన నరకం చూపించి, మత్తు పన్నీటిలో తడిపేసావమ్మ, నడిసంద్రంలోన నావను గుర్తించి, కత్తిని గుండెలో గుచ్చేసావమ్మ, నిశిరాత్రిలో నా దివ్వెను అర్పించి, ప్రేమ మార్గాన్ని చెరిపేసావమ్మ , తారల మెరుపుల్లో నవ్వును తొలగించి, చీకటి కన్నీళ్ళను నేర్పించావమ్మ, కడగళ్ళ పంజరంలోనా, వడగళ్ళ వానను కురిపించి, చిరుజళ్ళు దర్శనంలోన, తడికళ్ళతో దీపం వెలిగించావు! పవనాల పరిచయంలోన, పయనాల దారులు చెరిపేసి, గమనాల హౄదయపు సడిలోన, నయనాలలోమెరుపును దించావు!! చివరికి నువ్వు... సాగవే, సాగవే సహనం లేని సాగరంలా... నిలిచావే, నిలిచావే ని...

అందం నా హక్కు.. శీతాకాలంలో చర్మ సం రక్షణ...

Image
ఈ శీతాకాలంలో కోల్డ్ క్రీంస్, మాయిశ్చురైజర్స్ ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక వాటిని ఉపయోగించనివారు (అంటే అవి పడకో లేక వాటివలన ఇతర చర్మ వ్యాధులు వస్తాయనే అపోహ ఉన్నవారు) ఉంటారు. ఇలాంటి వారి కోసం ఈ "రోజ్ కోల్డ్ క్రీం" ప్రయత్నించి చూడండి. రోజ్ కోల్డ్ క్రీం: కావలసిన పదార్దాలు: ఆలివ్ ఆయిల్-4 టేబుల్ స్పూన్స్, గులాభి రెక్కలు - తాజాగా ఉండేవి, బిస్ వ్యాక్స్ -1 టేబుల్ స్పూన్ (అన్ని ప్రముఖ దుకాణాలలో దొరుకుతుంది), స్వచ్చమైన నీరు- తగినంత. తయారు చేసే విదానం : ఆలివ్ ఆయిల్ ని బాగా మరిగించి దానిని ఒక గాజు సీసా/పాత్రలో వేసుకోవాలి. అందులో గులాభి రెక్కలను వేసి గాలిబయటకు పోకుండా మూత బిగించాలి. దానిని ఒక వారం రోజులు అలానే ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడపోసి గులాభి రెక్కలను వేరు చేయాలి. ఇప్పుడు గులాభి సుగంధం వెదజల్లే ఆలివ్ ఆయిల్ మిగులుతుంది. ఇప్పుడు మరొకపాత్రలో బీన్ వ్యాక్స్ తీసుకుని బాగా కరిగే వరకు వేడి చేయాలి. కరిగినాక సుగంధంకల ఆలివ్ ఆయిల్ ని కలిపి పాత్రను కిందకు దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత కొద్దిగా నీటిని కలిపితే "రోజ్ కోల్డ్ క్రీం" రెడీ. దీనిని ఒక బాటల్ లో నిల్వ చేసుకున...