అందం నా హక్కు....
కాలం, ౠతువులు ఏప్పుడు ఒకేలా ఉండవు. మరి మనం కూడా కాలనికి తగినట్టు మన సౌందర్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. చర్మ సౌందర్యం కాపాడుకోడానికి కొన్ని ప్రకృతిసిద్దమైన చిట్కాలు.
- ఒక కప్పు పెసరపిండిలో అర టీ స్పూన్ పచ్చిపసుపు,9-10 స్పూన్ల బాదం నూనే కొద్దిగా నీళ్ళు వేసి పేస్టులా కలుపుకోవాలి.ఈ పేస్టుని పలుచని పొరలా శరిరానికి పట్టించాలి.పుర్తిగా ఆరిన తరువాత మెల్లగా రుద్దుతూ వదిలించి ఆ తరువాత స్నానం చేయాలి.
- పచ్చి బంగాళదుంపను చక్రాలుగా కోసి ముఖంపైన రుద్దితే మచ్చలు, గీతలు పోతాయి.
- పచ్చి పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తరువాత కడగాలి. ఇది సహజసిద్దమైన బ్లీచ్.చర్మాన్ని తెల్లబరుస్తుంది. ఎండకు కమిలిన చర్మాన్ని తిరిగి యధాస్తితికి తెస్తుంది.
- కమలపండు తొక్కలను ఎండబెట్టి పొడిచేసి దానిలో పెరుగు కలిపి ముఖానికి పట్టించి 15 ని//. తరువాత కడిగితే ముఖంపైన మచ్చలు పొయి ముందు లేనంత కళ వస్తుంది.
- తేనె చర్మానికి మృదుత్వాన్ని, మెరుపుని ఇస్తుంది, ముడతలను తగ్గిస్తుంది. కాబట్టి ఏ ప్యాక్ లోనైనా 3-4 చుక్కల తేనె కలుపుకోవచ్చు.
- కీర రసం సహజమైన ఆస్త్రింజెంట్, ఇది చర్మానికి మృదుత్వాన్నివ్వడంతో పాటు అదనంగా ఉన్న జిడ్డును తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఈ రసాన్ని ముఖానికి పట్టించి 15 ని//. తరువాత కడగాలి.
దన్యవాదములు...
Comments
అరుణ.
ప్రతాప్ గారు 04-10-2008న (అందం నా హక్కు.... చర్మ సౌందర్యం కాపాడుకోండిలా.) మీ సమస్యకు పరిష్కారం చెప్పడం జరిగింది. పసుపు,తేనె ఇవన్నీ మనవల్ల కావు అన్నారు. కాని ప్రకృతిసిద్దంగా లభించే అందానికి కృత్రిమంగా లభించే అందానికి చాలా తేడా ఉంది. మీది డ్రై స్కిన్ అన్నారు కాబట్టి ఏదైనా కొబ్బరినూనే గుణాలున్నా సబ్బులను లేదా "బాడి జల్ లను(body gels)" వాడండి. దానితో పాటుగా ప్రతిరోజు "మాయిశ్చురైసర్(Moisturizer cold cream)" ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
మీ శ్రీసత్య...
శాంతిరాజు గారికి, సాహితిచంద్ర గారికి "ఆస్త్రింజెంట్" అంటే శరీరంపైన ఉన్న అదనపు చెమట,జిడ్డు కలిగించే తడి అని అర్ధమండి. కీర రసం ఈ సమస్యను బాగా పోగొడుతుంది.అతి త్వరలోనే ఆరోగ్యసంబందిత సలహాలను కూడా ప్రచురిస్తానండి.
దన్యవాదములు.
మీ శ్రీసత్య...
క్షమించండి. పైన నా సమాదానంలో "ఆస్త్రింజెంట్" అంటే శరీరంపైన ఉన్న అదనపు చెమట,జిడ్డు కలిగించే తడి అని ప్రచురించాను. కానీ "ఆస్త్రింజెంట్" అంటే శరీరంపైన ఉన్న అదనపు చెమట,జిడ్డు కలిగించే తడిని **తోలగించేది** అని అర్ధం. మార్పును గమనించగలరు.
దన్యవాదములు.
మీ శ్రీసత్య...
vivek
@ లక్ష్మిగారికి,
@ నవ కవిత గారికి,
@ వివేక్ గారికి నా తరువాతి ప్రచురణలో "కురులు రాలకుండా ఉండాలంటే ఏఏ జగ్రత్తలు తీసుకోవాలో" తప్పకుండా వివరిస్తాను.
@ అరుణ గారికి మీరు కోరిన "పాదల రక్షణ" కూడా త్వరలోనే ప్రచురిస్తాను.దన్యవాదములు...
మీ శ్రీసత్య...
అరుణ.