పొద్దు పొడిచింది...!
కాలాలు మారినా నీ కలలు మారవు...!
ఋతువులు మారినా నీ రాగాలు మారవు...! గగనాలు మారినా నీ గానాలు మారవు....!నిమిషాలు మారినా నీ నయనాలు మారవు...! తేదీలు మారినా నీ తలపులు మారవు...!
ఏమిటండి అందరు ఇదేదో ప్రేమ కావ్యం అనుకుంటున్నారా! కాదండి ఇది ఒక జీవిత నిత్య సత్యం! ప్రతి నిత్యం మన జీవితాల్లో దేని కోసం ఎదురుచూస్తున్నామో అదే ఈ "పొద్దుపొడిచింది". మనుష్యులలో ఆలోచనా విదానం ఒకేలా ఉండదు. ఇది అందరూ అంగీకరించే నిజం అవునుకదండీ...!
అప్పటివరకూ చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా, నిశబ్దంగా ఉన్న ప్రపంచాన్ని తన వాలు చూపులు అనే కిరణాలతో రెచ్చగొడుతూ నిశిరాత్రిలో పవళిస్తున్న వారిని తన చిలిపి చేష్టలతో ఓలలాడిస్తున్న వెన్నెల శరీరం నుండి గాలి వేగంతో దూసుకెళుతూ, కటిక చీకటి అనే కలలు తెరలను మేలుకొలుపుతూ నేను వస్తున్నా పట్టించుకోరే లెగండీ... లెగండీ...! అంటూ మనల్ని మేలుకొలుపుతుంది వేకువ అనే అరుణ కిరణం. మరి ఆ లోక చక్రాదిపతి పడుతున్న వేదన ఇది...
ఈ లోకంలో కృత్రిమంగా తమ శరీరాలకు మెరుగులు దిద్దుకుని తమ హొయలను ఎదుటివారికి చూపించి అన్ని విధాలుగా వారిని కించపరుచుతూ తామే అన్ని రంగాలలో, అన్ని విషయలలో గొప్పవారిమని (కలలుకనే వారికి) కలలు కంటూ ప్రచారం చేసుకునేవాళ్ళకు సైతం,
చూడండి.....!,
నా అందం, నా సోయగం, నా వంపులు, నా సొంపులు, నా సౌందర్యం,నా అలంకారం అంటూ పురివిప్పిన నెమలిలా ఈ లోకానికి ఒక్కసారిగా తన గుభాలింపు సోయగాన్ని చూపిస్తాడు ఆ సూర్య భగవానుడు. కాని నీతికీ నిజాయితికీ అర్దం కరువైన ఈ యాంత్రికయుగంలో మానవులుగా పుట్టి, మంచితనం అనే మాటను మడిచి చాపలా చుట్టి, సహ జీవనం అనే మాటను పక్కన పెట్టి, వ్యక్తిగత జీవితం గడుపుతూ తమ స్వార్దం, తమ సంపాదన చూసుకునే మీరే అంత వయ్యరం ఒలకభోసేటప్పుడు, ఏ స్వార్దం లేకుండా, ఏ కులమత వ్యత్యాసం లేకుండా, ఏ భాషాభేదం లేకుండా, పేదవాడు, గొప్పవాడు అనే తేడాలేకుండా, మనిషి, పశుపక్షాదులు అనే తారతమ్యం చూడకుండా, ప్రపంచం మొత్తానికి నేను సైతం అంటూ ఏ వర్ణ వర్గ బేదం లేకుండా స్వచ్చమైన మనసుతో వెలుగును పంచుతున్నాను. మీకు ఇంక "పొద్దుపొడిచింది" మీ నిత్య కృత్యాలు ఇంక మొదలుపెట్టండి అంటూ వేకువను మీ ముంగిళ్ళకు పంపుతున్నను.
కానీ ఏమి ప్రయోజనం నాకన్నా మీరే ఎక్కువ వయ్యారాలు పోతున్నారు. ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, నిరంతరం ఈ సృష్టికి శ్రమ అని భావించకుండా మీకు వెలుగును పంచి మీ కార్యకలాపాలకు ఏ ఆటంకం రాకుండా చేస్తున్న నన్ను ఒక్కసారి చూడండి. నాలో కూడా బాదానేది దాగుంది. అది మీరు చేసే పనులవల్లే కలుగుతుంది. మీతో ఏ సంబందం లేని నాకే ఇలా ఉంటే మీ సంబందికులకు మీరు చేసే అన్యాయాలు, అక్రమాలకు వారెంత బాదపడుతుంటారో అలోచించండి. తప్పు చేసిన వాళ్ళే తలదించికుని నించుంటారు. మరి మీరెందుకు నన్ను చుడడానికి కూడా భయపడుతున్నారు. మీరు ఏ సమయంలో కుడా తప్పు చేయలేదు అని మీ ఆత్మపైన ప్రమాణం చేసి మీ మనోనేత్రంతో నన్ను చూడండి. నన్ను చూడడానికిఎందుకు భయం. నేనేమి ప్రళయాణ్ణి,విళయాణ్ణి కాదు.
ఒక తప్పు చేస్తే దాని గురించి అలోచించేవారికే తెలుస్తుంది. కానీ అందరు చేసే తప్పులను పైనుండి నేను చూస్తున్నాను. ఆ తప్పులకు కలిగే బాద వలనే నేను ఇలా ప్రళయాగ్నిలామండుతున్నాను. మీ పాపాలు ఎక్కువవ్వడం వలనే మీరు నన్ను చూడలేక పోతున్నారు. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఒక్కటయినా పలువురు సంతోషపడే పనిచేయండి... అప్పుడు నేను ఈ హృదయ బాదను తాగ్గించుకుని వెన్నెల కన్నా చల్లగా మారతాను అని ఘోషిస్తున్నాను..
మీలో మార్పు రావాలనే నేను రోజు మీ ముంగిళి ముందుకు వస్తున్నాను. ఒక్కరోజయిన నన్ను చూసి, నాలో ఆవేదన చూసయినా మీలో దాగున్న, మీ మనసులో బయటకు రాకుండా నిద్రపోతున్న మంచి మానవత్వం అనే రూపాన్ని"పొద్దు పొడిచింది లేవరా...!" అని మేలుకొలుపుతారేమోనని ఆశతో... ఇది ఎప్పటికీ నెరవేరుతుందో తెలియడం లేదు.
మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు, నమ్మకద్రోహాలు, అత్యాచారాలు, అగాయిత్యాలు, దొంగతనాలు, మరణహోమాలు వలన కలిగే వేదనను చూసి ప్రచండ అగ్నిహోళుడిలా మారి ఈ భూమండలానికి వేకువ కిరణాలకు బదులు అగ్నికీళల్నిపంపే విధంగా చేసి మీ జీవఉనికిని పోగొట్టుకోకండి. మనసున్న మనుషులుగా మారండీ అంటూ ఆవేదన చెందుతున్నాడు.
చివరిగా,
ఆ సుర్యుడిని అంతరాత్మగా భావించండి, ఆ బాదలను మీ మనసు పడే వేదనగా మలచుకోండి, ఆ అగ్నికీళల్ని మీ మరణఘొషగా అంగీకరించండి. ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దడం ఎలానో మన వల్ల కాని పని అనుకునే వాళ్ళు నేటి నుంచి అయినా ఇలాంటి పరులాత్మను బాదించే పనులను మాని నిత్యనూతనంగా మీ జీవితాన్ని ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపండి.
ప్రపంచాన్ని మర్చడానికి ఏవరో రానవసరం లేదు. మనలో మోదటిగా "స్వర్ధం" అనే మటను పక్కన పెట్టి "మంచి" అనే బందాన్ని మెలుకొలపండి. మీకు ప్రతిరోజు మంచి ఆలోచనలతో కూడిన వేకువతో "పొద్దు పొడుస్తుంది".
ఆలోచించండీ. ఆచరించడానికి ప్రయత్నించండి.
దన్యవాదములు...
Comments
Inka meeru raase padala vishayaaniki vasthe telugunu marchipoye rojullo kuda manchi manchi padalato mee kavithanu raasthunnaru really i like ur writing style mee kavithalu entha chadhivina ennisarlu chadhivina inka inka chadavaali anipinchelaaga vuntaayi. mee next kavitha kosam wait chesthuu.........
అరుణ.
అరుణ.
Once again I am thanking to srisatya sir, to share my feelings to all. Thank you.
పొలికలోనే ఇతరులకు అందనంత యేత్తుకు వెల్లారు.చాలా బాగుందండి.
vivek.
"ప్రపంచాన్ని మర్చడానికి ఏవరో రానవసరం లేదు. మనలో మోదటిగా "స్వర్ధం" అనే మటను పక్కన పెట్టి "మంచి" అనే బందాన్ని మెలుకొలపండి. మీకు ప్రతిరోజు మంచి ఆలోచనలతో కూడిన వేకువతో "పొద్దు పొడుస్తుంది".ఆ పంచ్ లైన్ చాలా బాగుంది. మీకు నా ఆశిసులు.
mee "kadupulo kannillu" kavita chala baagundi.
మీరు చెప్పింది నిజమే కాని,మీరు చెప్పే మార్పు రావాలంటే ప్రతి ఒక్కరు అది మన బాద్యతగా భావించాలి.కాని అది జరుగుతుందంటారా.జరగాలని ఆశిస్తూ నావంతు 95 మార్కులు వేస్తున్నాను.
బొల్లోజు బాబా
vivek.
chandrashekar.
vinod.
అరుణ.
vivek.
నేను ఒక్కడినే ప్రపంచాన్ని మార్చడం సాధ్యంకాని పని కాని నా రచనల ద్వారా చుట్టూవున్న పరిస్తితులు,వాటి వలన కలిగే ప్రభావాలు,పరిణామాల గురించి ఈ బ్లాగ్లోకం ద్వారా పది మందికి పంచుదామనుకున్నాను.ఇది ఒకరి నుండి ఒకరికి వారి నుండి మరొకరికి ఇలా ప్రాచుర్యంపొంది చాలా మందిలో మార్పును తేచ్చేలా ఆలోచింపచేస్తుందా అని నా ఆశ ఉండేది.
కాని దీనికి మీనుండి వస్తున్న స్పందనలు చూస్తుంటే అది నిజమైనందుకు నా కృతఘ్నతలు.తప్పులు చేయడం మానవ సహజం అది ఒకరి ఉద్దేస్యపూర్వకంగానో,లేదా చుట్టూ వున్న పరిస్తితుల వలనో, లేదా మరొకరి ప్రొద్భలమువలనో జరుగుతుంటాయి.
కాని వాటిని తెలుసుకొని పశ్చాతాపపడే వారే మరల తప్పు చేసేటప్పుడు ఆలోచిస్తారు.ఇది చాలా మంచి ప్రవర్తనకు దారులుతీస్తుంది.
మొదటి సారిగా నా రచనలకు మార్కులు వేసి ఆశీర్వదించిన వారందరికి మరొకసారి నా కృతఘ్నాతలు.
మీ శ్రీసత్య...
**-----నవ కవి--------**
yet another beautiful poem!
i enjoyed it perhaps it has simpler words than your previous ones!Again thanks for posting.
మీ శ్రీసత్య...
మీ శ్రీసత్య...
http://nedurumalli22.blogspot.com/
**-----నవకవిత----**
అరుణ.