అందం నా హక్కు....కురుల సంరక్షణ-v

కురుల సమస్యలకు, కురుల వ్యాదులకు సంబందించి ఇంతకు ముందు విభాగాలలో చాలా రకాల ప్రకృతిసిద్ధమైన, ఔషదగుణాలు కలిగిన,విలువైన సలహాలను మరియు చిట్కాలను చూశాం. నేటి ఈ యాంత్రిక యుగంలో పెద్ద, చిన్న, యుక్తవయస్కులు, స్త్రీలు, పురుషులు అనే తేడాలు లేకుండా అందరు ఎదుర్కుంటున్న మరొక సమస్య "కురులు రాలిపోవడం, ఊడిపోవడం, చిట్లిపోయి పడిపోవడం మరియు తెగిపోవడం". దీనికి నివారణా మర్గాలను చూద్దాం.

  • సమయం దొరికినప్పుడల్లా, లేదా రాత్రి పడుకునేముందు "స్వచ్చమైన, మంచి నువ్వులనూనేతో లేదా కొబ్బరినూనెతో "తల నుండి కుదుళ్ళ వరకు మర్దనా చేయవలెను.

  • 2 టేబుల్ స్పూన్ల మెంతులు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసి జుట్టు కుదుళ్ళకు పట్టించాలి. ఒక గంట తరువాత కుంకుడు లేదా శికాకాయతో స్నానం చేయాలి.

  • వారానికి రెండుసార్లు పెసరపిండిలో పుల్లటి పెరుగు కలిపి తలకు రుద్దుకొని 30-60ని//.ల తరువాత తలకు స్నానం చేయాలి.

  • ఒక టేబుల్ స్పూన్ తాజా ఉసిరికాయల రసంలో(కొండ ఉసిరి), ఒక టీ స్పూన్ బాదం నూనే, ఆర టీస్పూన్ నిమ్మరసం కలిపి వారానికి ఒకసారి తలకు స్నానం చేయాలి.

  • కలబందను రెండుగా చీల్చి మద్యలో ఉలవలను పెట్టి గట్టిగా కట్టేయాలి. 2 రోజుల తరువాత దానిని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని అలానే తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయలి.

  • శీకాకాయపొడిలో ఎండిన ఉసిరికాయలు, నిమ్మతొక్కలు పొడిచేసి కలుపుకొని వాడితే జుట్టురాలడం తగ్గుతుంది.

  • కొబ్బరినూనెలో మందారపూలు వేసి కాచి వడపోయాలి. ఈ నూనెను రొజూ పడుకునేముందు తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాక జుత్తు ఒత్తుగా మారుతుంది.

దన్యవాదములు...

Comments

Unknown said…
Good morning hair ki sambandhinchi mee tips chaala baagunnayi alage inka ee winter seasonlo skin ki sambandhinchi marenno manchi tips cheppagalaru ani korukuntu mee next tip kosam waith chesthunnanu...........
Unknown said…
నమస్కారం శ్రీసత్య గారు!కురులకు సంబందించి గత 5 విభాగల్లో చాలా మంచి మంచి టిప్స్ ప్రచురించినందుకు మీకు కృతఙ్ఞతలు.కాని నాది ఒక చిన్న సందేహం తలకు స్నానం చేసేటప్పుడు బాగా కాచిన నీటితో చేయమంటారు వేడినీటితో ఏమి ఇబ్బంది ఉండదా తెలుపగలరు.

అరుణ.
అరుణ గారు ఏ కాలమైనా, చర్మానికైనా, తలకైనా గోరువెచ్చని నీరు శ్రేష్టం. బాగా కాచిన నీటితో తలస్నానం చేయవద్దు. ఎందుకు? అనే కారణం నాకు తెలీదు కానీ.. పెద్దవాళ్ళు ఇలాగే చెబుతారు.
Neeta said…
satya garu..!

good morning.
mee peru choosi meeru ammayani anukunnanu. sory..
hair gurinchi meerichina tips chala bagunnay.
inka inka manchi vishayalu cheptarani aakankshistunnanu.

Neeta.
వీక్షకులకు శ్రీసత్య నమ:సుమంజలి!

@ అరుణగారికి మీరు అడిగిన సందేహం చాలా మందిలో నేడు వున్నదే. దీనికి సమాదానం ఒక్కటే..! ఏ కాలమైనా,ఏ శరీరం వారికైనా, ఏ ఋతువులోనైనా గోరువెచ్చని నీళ్ళే శ్రేయస్కరం. ఏ సమయంలోనైనా, మరీ చల్లని లేదా మరీ వేడిగావున్న నీళ్ళతో తలకు స్నానం చేయరాదు. అది ఆ సమయంలో ఎటువంటి ప్రభావం చూపించకపోయినా భవిష్యత్తులో దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అందువలన గోరువెచ్చని నీటితో తలకు స్నానం చేయడం శ్రేయస్కరం.

@ తమ్మిన అమరవాణి గారికి నా ప్రత్యేక దన్యవాదములు. వీక్షకుల సందేహాలు తీర్చడంలో నాకు సహకరించినందుకు.

@ అమృత గారికి కృతఙ్ఞతలు.

@ నీత గారికి దన్యవాదములు.

భవిష్యత్తులో మరిన్ని మంచి, మంచి చిట్కాలను ప్రచురిస్తానని మనవిచేసుకుంటూ......


మీ శ్రీసత్య...
Anonymous said…
GOOD:-)
నా సమస్యకు పరిష్కారం తేలిపారు. తప్పక ఉపయోగించుతాను.మా బామ్మ కూడా ఏప్పుడు ఇలనే చెప్తుంటాది కాని నేనే పట్టించుకోను. కాని ఇప్పుడు ఇదె నిజమేమో అని అనిపిస్తుంది. రేపటినుండి ఇంట్లో చేస్తే ఎంటి కొత్త అలవాటు అంటారేమో చూడాలి.

దన్యావాదములు.
Anonymous said…
good afternoon srisatya sir! your tips are asusual very nice.can you tell me how many time we have to take a headbath in a week?
Unknown said…
శ్రీసత్య గారికి,తమ్మిన అమరవాణి గారికి, నా సందేహం తీర్చినందుకు ప్రత్యేకంగా దన్యవాదములు. నేటితో నా సందేహం పోయింది. ఇన్నాళ్లు ఏవరిని అడగాలో ఆర్ధంకాలేదు. ఈ బ్లాగ్స్ ద్వారా మీ అందరితో మా సందేహాలను తీర్చుకోగలుగుతున్నాము. అందుకు బ్లాగ్లో సభ్యూలందరికి నా తరపున దన్యవాదములు.

అరుణ.
శ్రీసత్య గారు వారానికి ఎన్నిరోజూలు అసలు తలకిస్నానం చేయాలి ఇదొక సందేహం. మరి దీనికి కూడా పరిష్కారమర్గాలను చేప్పాలి.
Unknown said…
annayaa!thanks for posting "KURULA SAMRAKSHANA-V" meeru cheppindi nijame endukante idi prati okkari present face chestunna problem. naa problem ki solution chepparu thanks annayaa.

vivek.
Anonymous said…
This comment has been removed by a blog administrator.
వీక్షకులకు శ్రీసత్య నమ:సుమంజలి!

@ నవకవి గారికి

@ విద్య గారికి
తలకు వారానికి ఇన్నిసార్లు స్నానంచేయాలి అనే నిబందన ఎమి లేదు. ఎండాలో ఎక్కువగా తిరిగినా, వేడి ప్రదేశాలలో బాగా పనిచేసే వారైతే రోజూ తలకుస్నానం చేయవచ్చు. మిగిలిన వారు వారానికి 2-3 సార్లు చెస్తే సరిపోతుంది.

దన్యవాదములు...

మీ శ్రీసత్య...
బాగున్నాయండి. అవును నాకోక డవ్ట్ వచిందండి. మీరు "అందం నా హక్కు" తరువాత ఎదో ఒక అంశం పైన ఒక అందమైన రచన రాస్తారుకదండి. మరి ఏమైందండి. మా అందంకోసమేనా, మా మనసుల ఆహ్లాదానికి కూడా మీదే బాద్యత.
Anonymous said…
&(*&^F&^%%$$##UUGJLOUY^%$# :)

Popular posts from this blog

ఓ జాలిలేని నేస్తమా... !

అందం నా హక్కు....చర్మ సౌందర్యం కాపాడుకోండిలా.

అందం నా హక్కు....కురుల సంరక్షణ-II.