అందం నా హక్కు....కురుల సంరక్షణ-v
కురుల సమస్యలకు, కురుల వ్యాదులకు సంబందించి ఇంతకు ముందు విభాగాలలో చాలా రకాల ప్రకృతిసిద్ధమైన, ఔషదగుణాలు కలిగిన,విలువైన సలహాలను మరియు చిట్కాలను చూశాం. నేటి ఈ యాంత్రిక యుగంలో పెద్ద, చిన్న, యుక్తవయస్కులు, స్త్రీలు, పురుషులు అనే తేడాలు లేకుండా అందరు ఎదుర్కుంటున్న మరొక సమస్య "కురులు రాలిపోవడం, ఊడిపోవడం, చిట్లిపోయి పడిపోవడం మరియు తెగిపోవడం". దీనికి నివారణా మర్గాలను చూద్దాం.
- సమయం దొరికినప్పుడల్లా, లేదా రాత్రి పడుకునేముందు "స్వచ్చమైన, మంచి నువ్వులనూనేతో లేదా కొబ్బరినూనెతో "తల నుండి కుదుళ్ళ వరకు మర్దనా చేయవలెను.
- 2 టేబుల్ స్పూన్ల మెంతులు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసి జుట్టు కుదుళ్ళకు పట్టించాలి. ఒక గంట తరువాత కుంకుడు లేదా శికాకాయతో స్నానం చేయాలి.
- వారానికి రెండుసార్లు పెసరపిండిలో పుల్లటి పెరుగు కలిపి తలకు రుద్దుకొని 30-60ని//.ల తరువాత తలకు స్నానం చేయాలి.
- ఒక టేబుల్ స్పూన్ తాజా ఉసిరికాయల రసంలో(కొండ ఉసిరి), ఒక టీ స్పూన్ బాదం నూనే, ఆర టీస్పూన్ నిమ్మరసం కలిపి వారానికి ఒకసారి తలకు స్నానం చేయాలి.
- కలబందను రెండుగా చీల్చి మద్యలో ఉలవలను పెట్టి గట్టిగా కట్టేయాలి. 2 రోజుల తరువాత దానిని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని అలానే తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయలి.
- శీకాకాయపొడిలో ఎండిన ఉసిరికాయలు, నిమ్మతొక్కలు పొడిచేసి కలుపుకొని వాడితే జుట్టురాలడం తగ్గుతుంది.
- కొబ్బరినూనెలో మందారపూలు వేసి కాచి వడపోయాలి. ఈ నూనెను రొజూ పడుకునేముందు తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాక జుత్తు ఒత్తుగా మారుతుంది.
దన్యవాదములు...
Comments
అరుణ.
good morning.
mee peru choosi meeru ammayani anukunnanu. sory..
hair gurinchi meerichina tips chala bagunnay.
inka inka manchi vishayalu cheptarani aakankshistunnanu.
Neeta.
@ అరుణగారికి మీరు అడిగిన సందేహం చాలా మందిలో నేడు వున్నదే. దీనికి సమాదానం ఒక్కటే..! ఏ కాలమైనా,ఏ శరీరం వారికైనా, ఏ ఋతువులోనైనా గోరువెచ్చని నీళ్ళే శ్రేయస్కరం. ఏ సమయంలోనైనా, మరీ చల్లని లేదా మరీ వేడిగావున్న నీళ్ళతో తలకు స్నానం చేయరాదు. అది ఆ సమయంలో ఎటువంటి ప్రభావం చూపించకపోయినా భవిష్యత్తులో దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అందువలన గోరువెచ్చని నీటితో తలకు స్నానం చేయడం శ్రేయస్కరం.
@ తమ్మిన అమరవాణి గారికి నా ప్రత్యేక దన్యవాదములు. వీక్షకుల సందేహాలు తీర్చడంలో నాకు సహకరించినందుకు.
@ అమృత గారికి కృతఙ్ఞతలు.
@ నీత గారికి దన్యవాదములు.
భవిష్యత్తులో మరిన్ని మంచి, మంచి చిట్కాలను ప్రచురిస్తానని మనవిచేసుకుంటూ......
మీ శ్రీసత్య...
దన్యావాదములు.
అరుణ.
vivek.
@ నవకవి గారికి
@ విద్య గారికి
తలకు వారానికి ఇన్నిసార్లు స్నానంచేయాలి అనే నిబందన ఎమి లేదు. ఎండాలో ఎక్కువగా తిరిగినా, వేడి ప్రదేశాలలో బాగా పనిచేసే వారైతే రోజూ తలకుస్నానం చేయవచ్చు. మిగిలిన వారు వారానికి 2-3 సార్లు చెస్తే సరిపోతుంది.
దన్యవాదములు...
మీ శ్రీసత్య...