అందం నా హక్కు....కురుల సంరక్షణ-IV.
కురుల సంరక్షణకు సంబందించి ఇంతకు ముందు విభాగాల్లో కొన్ని మంచి చిట్కాలు చూసాము.మరి కాలానికి తగ్గట్టుగా కురులను సంరక్షించుకోవలసిన భాద్యత కూడా మనదే...! మరి ఆ చిట్కాలను కూడా చూద్దాం.. కాలానికి తగినట్టుగా కురుల సంరక్షణ... వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా తడుస్తుంది.త్వరగా ఆరుతుంది కదా అని డ్రయ్యర్ తో ఆరబెట్టకూడదు.అలా చేయడం వలనా వెంట్రుకలు చిట్లిపోయేఅవకాశం వుంటుంది.మెత్తని బట్టతో తలను తుడిచి వీలయితే నిప్పులతో ఆరబెట్టుకోవాలి. వర్షాకాలంలో పగటివేల ఎటువంటి నూనెలు తలకు రాయకుండా ఉండడం మంచిది నూనె వలన ముఖ:మంతా జిడ్డుగా అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎండా, దుమ్ము,ధూలీ వలన జుట్టు రాలిపోతుంటే & జీవం లేనట్టు కనిపిస్తే ఒక కప్పు పాలలో ఒక కోడి గుడ్డు సొన కలిపి తలకు పట్టించి 30 నిమిషముల తరువాత శుభ్రపరుచుకోవాలి. చలికాలంలో జుట్టు పొడిగా ఉంటే ఆలివ్ ఆయిల్ గోరువెచ్చగా చేసి దానితో మర్దనా చేసుకోవాలి. జుట్టు మరీ జిడ్డుగా ఉంటే నువ్వుల నూనెతో మర్ధనా చేసుకుని గంట తరువాత శుభ్రపరుచుకోవాలి. కురులకు "కండీషనర్"... జుట్టు ఆరొగ్యంగా పొడవుగా పెరగాలంటే వారానికి ఒకసారి ఆముదం రాయాలి. వారానికి ఒకసారి టీ డికాషనుతో తల స్నానం చేస్...