చేజారిన "రోజా పువ్వు"...
ఒక రోజా పువ్వు..., అది ఏన్నో ఆశలతో ఈ లోకంలోకి అడుగు పెడదాం అనుకుంది.కాని అది రాకముందునుండె దానిపై ఏన్నోచూపులు.
కొందరు ప్రేమతో దాని సౌంధర్యంచూసి ఆనందించెవారైతే!
కొందరు దానిని తురిమి కురులలో పెట్టుకుందామనుకునేవాల్లు!!
కొందరు దానిని తమ ఇష్టదైవానికి సమర్పించాలనుకునేవారైతే!
ఇంకొందరు దానిని ఎవరి కంటాపడకుండా దాచేయాలనుకునేవాల్లు!!
కాని పాపం ఆ రోజాకేమి తెలుసు తాను విరబూయకముందు...
ఏ చూపులు తనను స్వాధినపరుచుకోవాలనుకుంటున్నాయో,
ఏ చేతులు తనను తుంచబోవాలనుకుంటున్నాయో,
ఏ కురులు తనను అలంకరించుకోబోతున్నాయో,
ఏ దైవం తన సుగంధరేణువులను ఆస్వాదించబోతున్నాయో.....
ఇవి ఏవి తెలియకుండా తను ఈ ప్రపంచనికి స్వేచ్చగ,ఆనందంగా,సంతోషంగా,ఉల్లాసంగా తన అంత:ర్సౌంధర్యన్ని చూపిద్దామనుకుంది. చడి చప్పుడు లేని,ప్రళయాలకి కోలువుకాని,ప్రశాంత వాతవరణంలో ఒక నిశిరాత్రివేళ తన అందం విరబోసేలా,లోకమంతా రెప్ప వేయకుండా చూసెలా,చిలిపిమనసులు తల్లడిల్లేలా,కన్నేహృదయాలను కోల్లగొట్టేలా,లోకానికి వేలుగునిచే సూర్యుడు కూడ తలదించుకునేలా, ఏర్రని కాంతులతో విరభూసింది.
"తన అందాన్ని చూసి తానే ఆశ్చర్యపొయింది,ఆందరి వాలు కనుల చూపులకు సిగ్గులతో మురిసిపొయింది".
తన పుప్పొడిరేణువుల సుగంధంతో తుమ్మెదలకు,తన ఆకర్షణీయమైన మోముతో చిలిపి హృదయములకు నిద్రరాకుండా చేయసాగింది ఇలా తనని తాను పొగుడుకుని,మురిసే లోపే అది పుపూయగానే మొదలునుండి విడదీయడానికి అనేక కళ్లు వత్తులు వేసుకుని యెదురుచూస్తున్నాయి।కాని ఇది యేమి చేయలేదుగా తనను తాను దాచుకోలేదుగా చేజారిన క్షణాలు అన్నీ మల్లీ తిరిగి రావుగా తొందరపడి పూసినందుకు, కంటి నిండా కన్నీళ్లతో నన్ను ఈ లోకం నుండి వేరుచేయకండి అని అరవలేదుగా నేను పుట్టింది అందరికి ఆనందం పంచడానికి అని చెప్పలేదుగా. ఇలా తనలో తాను కుమిలిపోయి, తన మకరందం హరించేలా అలజడి పడుతూ తన మనసులో రక్తపు మరకలను నింపుకుంది.
ఇంతలోనే తన అలజడి నిజమైంది.........
ఆ పువ్వును ఒక హృదయం పూజకోసం,ఒక హృదయం కురుల కోసం,ఒక హృదయం దాని తేనెల కోసం, అనుకుంటూ పోటీ పడసాగాయి.కానీ ఇది బయటకు చెప్పలేని స్థితి దానిది।కారణం దానికి మాటలు రావుగా,తన భావాలను తెలపలేదుగా, ఇవన్నీ పడని జాలి లేని హృదయాలు ఒక దాని తరువాత ఒకటి,ఒకరినొకరు కించపరచుకుంటూ,ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ, ఆ పువ్వుపై తమ ఆదిపత్యం చూపసాగాయి। వీరి ఘర్షనలో ఆ పువ్వుకి ఊన్న పధునైన ముళ్ళకి వీరి తనువులు తగిలి వారి రక్తం ఆ పువ్వు పైన పడి ఇంకా,ఇంకా ఎర్రగా అగ్ని గుండాన్ని తల ధన్నేలా ఎర్రటి నెత్తుటి వర్ణం తో శోభిల్లుతూ అందరి చేతులలో నలిగిపోసాగిందీ......
చివరిగా........
ఆ రొజా పువ్వు తన రెక్కలను ఒక్కొక్కటిగా కోల్పోయి. చివరకు ఏండిన మొడులా మిగిలింది. ఆ హృదయాలు కూడా తమ అదృష్టం ఇంతే అనుకొని మరల "రోజా పుస్తుందిలే" అనుకొని అక్కడినుండి వేళ్ళిపోసాగాయి. చివరికి అక్కడ ఏవరికి సంతోషం కలుగలేదు. కలిగింది,మిగిలింది ఒక్కటే "శూన్యం". అంతా ఐపొయినాక అవి ఒకదానికొకటి తాము చెసిన పనులు చూసి సిగ్గుతో తమ ముఖాలను చూసి దాచేసుకున్నయి.కాని అప్పటికే జరగాల్సినదంతా జరిగిపొయింది.
"పొయిన కలాన్ని గడిచేకొద్ది తీసుకురాగలమ! చేజారిన జివితాన్ని బ్రతికున్నా పొందగలమా!!" అనుకొని బాదపడ్డాయి.
ధన్యవాదములు.

Comments
అరుణ.
శాంతిరాజు,
విశాఖపట్నం.
మీ నుంచి మరిన్ని టపాలకై ఎదురుచూస్తుంటాను.
బొల్లోజు బాబా
BYE.
mee next rachana kosam chustuu
vivek