అందం నా హక్కు....కురుల సంరక్షణ-III
నేడు ఎక్కువగా మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఎదుర్కుంటున్న చాలా పెద్ద సమస్య "జుత్తు తెల్లగా మారడం".ఈ ఆధునిక ప్రపంచంలో వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న సమస్య ఇది.మరి దీనికి నివారణ మర్గాలను చూద్దాం.
- మెదటిగా ప్రతి ఒక్కరు చెయ్యాల్సిన పని "టీ,కాఫి,డ్రింకింగ్,మసాల పదార్దాలు మొ//" తినడం కాస్త తగ్గించాలి.
- ఒక స్పూన్ కర్పూరం పొడిని, కొబ్బరినూనేలొ కలిపి ప్రతి రెండు రోజులకు ఒక్కసారి మసాజ్ చేసుకోవాలి.
- మల్లెతీగ వేళ్ళని, నిమ్మరసంలో కలిపి గ్రైండ్ చేసి తలకుద్దుళ్ళ వరకు పెట్టి 30ని//.ల తరువాత శుబ్రపరచుకోవాలి.
- తలస్నాననికి వీలైనంతవరకు కుంకుడు కాయలు, శీకాకాయలను ఉపయోగించడం ఉత్తమం. అవి లభించనప్పుడు తక్కువ గాఢతగల షాంపూలను,హెర్బల్ షాంపూలను ఉపయోగించడం మంచిది.
- కోబ్బరినూనేలో కాస్త నిమ్మరసం కలిపి వేడిచేసి ప్రతి రోజూ పడుకునే ముందు మసాజ్ చేసుకుంటే మంచిది.
- తలస్నానం చేసినాక చేతివేళ్లతో కుదుళ్లకు మసాజ్ చేసుకుంటే బ్లెడ్ సర్కులేషన్ పెరిగి కురులు ఆరోగ్యంగా పెరుగుతాయి.
- ఉసిరికాయలను ముక్కలుగా చేసి అందులో పిక్కలను తీసి బాగా ఎండబెట్టి, ఆవునేతిలో వాటిని వేయించి రోజూ తింటుంటే తెల్ల జుత్తు మీ దగ్గరకు రావడానికి కూడా బయపడుతుంది, రాలడం కూడా తగ్గుతుంది.
- ఒక కప్పు గోరింటాకులో,3 కరక్కాయలు వేసి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని 4-5గ//. ఇనుప పాత్రలో ఉంచాలి. లేకపొతే ఏదైన పాత్రలో వేసి చిన్న, చిన్న ఇనుపముక్కలు వేయలి.తరువాత ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయ్యాలి.ఇలా వారానికి ఒకసారి చేయ్యాలి.
పైన చెప్పిన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే 60-70యేళ్లు. వరకు జుత్తు తెల్లబడకుండా నల్లగా నిగనిగలాడుతుంది.
దన్యావాదములు...
To be continued...
Comments
vivek