ఈ విరహానికి అర్దం తెలిపేది నీవే కదా! ఈ ఎడబాటుకి భావం తెలిపేది నీవే కదా! తెలుపమా నా ప్రాణమా, కన్నె హృదయం విలవిలలాడుతుంది. చూపుమా ఓ నేస్తమా, కన్నె వయసు భాదలో అలపిస్తుంది. కనులకు తెలియని కావ్యాలే కదలుగా మారెలే, మాటలకందని ముత్యాలే మదురిమలాయెలే, ఎదురుగా ఉంటూ యెద బాద వినవా గీతమా, ఎదురై వచ్చి యదలోనే కొలువుండు సంగీతమా! కన్నులు తెరిస్తే జననం అని, కన్నులు మూస్తే మరణం అని, తెరిచి తెరియని కనులను చూపడం న్యాయమా! నిప్పుల వెంట తియ్యని వల, విషమును చిమ్మే కమ్మని కల, రెంటిని కలిపి ఒకదానిలా చూపడం ధర్మమా!! నిమిషానికి ఒకటైన నరకం చూపించి, మత్తు పన్నీటిలో తడిపేసావమ్మ, నడిసంద్రంలోన నావను గుర్తించి, కత్తిని గుండెలో గుచ్చేసావమ్మ, నిశిరాత్రిలో నా దివ్వెను అర్పించి, ప్రేమ మార్గాన్ని చెరిపేసావమ్మ , తారల మెరుపుల్లో నవ్వును తొలగించి, చీకటి కన్నీళ్ళను నేర్పించావమ్మ, కడగళ్ళ పంజరంలోనా, వడగళ్ళ వానను కురిపించి, చిరుజళ్ళు దర్శనంలోన, తడికళ్ళతో దీపం వెలిగించావు! పవనాల పరిచయంలోన, పయనాల దారులు చెరిపేసి, గమనాల హౄదయపు సడిలోన, నయనాలలోమెరుపును దించావు!! చివరికి నువ్వు... సాగవే, సాగవే సహనం లేని సాగరంలా... నిలిచావే, నిలిచావే ని...
Comments
vivek.
అరుణ.
మీ జివితంలో కూడా రంగుల సోయగాలు విరబూయలని ఆశిస్తున్నాను