ఎక్కడికి ఈ పయనం...!
రోజుకు 24 గంటలు కానీ, మనిషి ఆలోచనలకి ఎన్ని గంటలు ఉన్నా సరిపోదు, అని సరిగ్గా గుర్తులేదు కానీ ఎక్కడో నా చిన్నప్పుడు చదువుకున్నాను... ఇది నిజం కాదంటారా!! నిజమే నేమో ఎందుకంటే నేను కూడా ఒక మనిషినేగా...! నాకు అలనే ఆనిపిస్తుందీ...
అది ఒక చల్లని సాయంత్రం వేళ కారు మబ్బులు గగనంలో స్వేచ్చగా విహరిస్తూ, అవి ప్రయాణించినందుకు ఇంధనరూపంలో స్వాతి చినుకులను మెల్లగా విరజిమ్ముతూ, ఇదిగో, నా పైన ఎందుకు పడుతున్నారు వద్దువద్దు అంటూ నేల తల్లి అంటున్నా వినకుండా పడుతున్నాయి, ఆ నంగనాచి చినుకులు చూడు అని నాకు చెప్పడానికి గమ్మత్తుగా తన మట్టి సుగందం వెదజల్లుతున్న వేళలో ఒక వాలుకుర్చిలో కూర్చోని అలోచించాను. నేను ఈ దేహాన్ని ఎందుకు పొందాను. ఎందుకు నాకు ఈ జీవితం ఆ దైవం ఇచ్చాడు అని.
తమకు ఎదురులేదని, మమ్మల్ని ఎవరు ఆపలేరని విర్రవీగే నీటి అలలను అడిగి చూసాను సమాధానం దొరకలేదు...!
తన బంగారు ఛాయతో దేనినయినా నాకు దాసోహం చేసుకోగలను అని తన అహంకారాన్ని చూపే అగ్నికిలల్ని అడిగి చూసాను సమాధానం దొరకలేదు...!
నవగ్రహలలో అధిపతి ఆ సూర్య భగవానుడైన జీవకోటికి ఆశ్రయమిచ్చెది నేనే అని చెప్పుకుంటూ వస్తున్న ధరని తల్లిని అడిగి చూసాను సమాధానం దొరకలేదు...!
జీవకోటికి ఆశ్రయమిచ్చేది భూమే అయినా, ఆ జీవకోటికి శ్వాసను ఇచ్చేది నేనే కదా అని తన ఆధిపత్యం చూపిస్తున్న పవనదెవుని అడిగి చూసాను సమాధానం దొరకలేదు...!
చివరిగా తన రకరకాల చీరల మార్పిడిలో లోకానికి కనిపిస్తూ, తన అలంకారానికి, సోయగానికి కారణం కనిపెట్టండి చూద్దాం అంటూ వయ్యారం వలకబోసే ఆ నింగిని అడిగి చూసాను సమాధానం దొరకలేదు...!
చెట్లను అడిగాను, ఏటి గట్లను అడిగాను,పున్నమి వెన్నలను అడిగాను,అమావాశ్య చీకటిని అడిగాను,ప్రాణం పోసే డాక్టర్ని అడిగాను, పాటాలు చెప్పే మాస్టారుని అడిగాను, పదాలు పలికే పసి పాపను అడిగాను , పురాణాలు చెప్పే పేదరాసి పెద్దమ్మను అడిగాను,కానీ సమాధానం దొరకలేదు...
ఇంతలో నా పక్కనుండే నిద్రను మాని చడీ చప్పుడూ లేకుండా మెల్లగా వెలుతున్న చీమల గుంపులను చూసాను, నిరంతరాయంగా తన వెలుగను లోకానికి విరజిమ్ముతున్న సూర్యుడిని చూసాను, చిమ్మ చీకటిలో కూడా తన చల్లదనాన్ని వెన్నెల రూపంలో పంచుతున్న చంద్రుడిని చూసాను ,ప్రతి రోజూ ఎన్ని కష్టాలు వచ్చినా భాదతెలియకుండా నవ్వుతూ తమ పని చేసుకునే ఆ పంచభూతాలను చూసాను. అప్పుడే అర్దమయ్యింది."రేపటి కోసమే కదా ఈ పయనం" అని.
బాదైనా, సుఖమైనా, లాభమైనా, నష్టమైనా మనిషి వాటిని భరించి ముందుకు సాగుతున్నాడు అంటే కారణం రేపటి కోసమే కదా! ఒకసారి అలోచించండి!!
దన్యవాదములు......
Comments
అరుణ.
vidya
vivek