ఆశలు మిగిల్చే కన్నీళ్లు...
మనిషి ఆశాజీవి .తనకి ఎన్ని కోరికలు, ఆశలు తీరినా మరలా క్రొత్త క్రొత్త ఆశలు పుట్టుకొస్తాయి. ఒక రోజున్న అభిరుచులు, అలవాట్లు మరొక రోజు ఉండవు. అందుకనే నేమో! మనం మనుషులుగా పుట్టాం!!
అప్పటి వరకూ అమ్మానాన్నలకు కూడా తెలియని, మిత్రులు, శ్రెయోభిలాశులకు కనిపించని, ప్రకృతిలో పంచభూతాలకు కానరాని ఒక క్రొత్త రూపం నేను మీతో పాటే ఉండాలని కోరుకుంటున్నాను, అంటూ అమ్మ కడుపులోనుండి అనేక ఆశలతో, కోరికలతో , అభిరుచులతో నెలలు నిండకుండానే ఎంత త్వరగా
ఈ లోకంలోకి వచ్చేదాం....,
ఈ ప్రపంచ అందాలను చూసేద్దాం....,
అందరి ప్రేమలను, ఆప్యాయతలను ఆస్వాదిద్దాం....,
క్రొత్త స్నేహాలతో తన చనువు పెంచుకుందాం......!
అనుకుంటూ క్రొత్తగా, సరిక్రొత్తగా ఈ సృష్టిలోకి తెరిచీ తెరవని కన్నులతో, నేనూ మీలో మనిషినే అనుకుంటూ గట్టిగా శబ్దం చేసుకుంటూ అడుగు పెడుతుంది పసి కందు "తనకే తెలియని ఆశలతో".
నిజానికి పుట్టగానే తనకే తెలియదు, ఎన్ని ఆశలతో ఈ లోకంలో అడుగు పెట్టిందో, కానీ అప్పటికే తనపై ఎన్నో కళ్ళు చాలా ఆశలతో ఎదురుచూస్తుంటాయి. పుట్టే బిడ్డ ఎలా ఉంటుందా అని ఇక్కడితో మొదలైన జీవనయానం(ఆశలరూపం) తీరం చేరేవరకు ఎదురుచూస్తూనే ఉంటుంది, ఆశల సాకారం కోసం.
అయితే ఈ ఆశలు,కోరికలను కోటలుగా కట్టి కొంతమంది కలలు అనే ప్రపంచం లో విహరిస్తుంటారు అదే సమయంలో ఆ కొరికల సాధన కోసం తలకుమించి శ్రమిస్తుంటారు. కాని అవి సాకారం చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురైతే "ఆశలు కన్నీళ్లనే మిగులుస్తాయి".
ఇంకొంతమంది విషయంలో అదృష్టాలు, అవకాశాలు కాళ్లవరకు వస్తాయి. కాని ఆ సమయంలో దాని గురించి పట్టించుకోకుండావదిలేసి, అవసరం వచ్చినప్పుడు కావాలనుకుని ఆశపడిన "ఆశలు మిగిల్చేది కన్నీళ్ళే".
ఈ ఆశలు, ఊహలు, కోరికలు ఇలాంటివన్నీ మనిషి పుట్టుక నుండి మరణించే టప్పుడు కూడా ఇంకా ఇంకా కావాలనీ పుడుతూనే ఉంటాయి. ఎందుకంటే వాటికి చావు, పుట్టుక ఉండవు కదా!!
"లేనివాడు తిండి కోసం, ఉన్నవాడు డబ్బు కోసం, విద్యార్ధి రిసల్ట్స్ కోసం, నిరుద్యోగి బ్రతుకు తెరువు కోసం , పసి పిల్లలు ఆట వస్తువుల కోసం , కరువులో ఉన్నవాడు చేయూత కోసం, ప్రేమికులు పెళ్లి కోసం, తల్లి దండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం".
ఇలా జీవితంలో ప్రతీ విషయంలో "ఆశ" కు ప్రాముఖ్యత ఇస్తున్నాం. కానీ అవి సాకారం కాని సమయంలో "ఆశ వలన మిగిలేవి కన్నీళ్లే".
"కాబట్టి ఆశలు ఉండడం సహజం. కాని అ ఆశలనే శ్వాసగా ఉండనివ్వకండి. వాటి సాకారం కొసం ప్రయత్నించండి....!"
దన్యావాదములు....
Comments
అరుణ.
vivek.
ఆశ దురాశగా మారితే మిగిలేది కూడా కన్నీళ్ళే.
మంచి సుభాషితం.