అందం నా హక్కు....కురుల సంరక్షణ-II.

మరి అలాంటి "పొడవైన,ఒత్తైన,ఆరోగ్యకరమైన కురుల కోసం " ఏం చెయ్యాలో చూద్దాం.
- మందార పూల రెక్కలను తుంచి కొబ్బరి నూనెలో వేసి మరిగించి, రోజు తలకి రాసుకుంటే కురులు పొడవుగా పెరుగుతాయి.
- కుంకుడు కాయ రసంలో మందార ఆకులు పేస్ట్ కలిపి తలకి స్నానం చేస్తే చుండ్రు తగ్గి జుత్తు పొడవుగా పెరుగుతుంది.
- మందారపువ్వుల రేకుల్ని జుత్తు రాలిన చోట రుద్దితే ఆ ప్రదేశంలో తిరిగి జుత్తు రావడానికి అవకాశముంటుంది. కనుబొమ్మలకు కూడా...
- మందార పువ్వులను కానీ ఆకులను కానీ పేస్ట్ చేసి తలకు పట్టిస్తే చుండ్రు, దురదా తగ్గి వేడి కూడా తగ్గుతుంది.
- మందార ఆకుల పొడి - 3 టేబుల్ స్పూన్స్ , తేనె-3 టేబుల్ స్పూన్స్ , కలబంద గుజ్జు - 6 టేబుల్ స్పూన్స్ వాటికి తగినన్ని కొబ్బరి పాలు వేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించి 30 నిమిషాల తరువాత తలకు స్నానం చేయాలి.
- తులసి ఆకులు, భృంగరాజు ,ఉసిరిక , కలబంధ, మందార ఆకులు, కరక్కాయ, కొబ్బరి నూనే కలిపి తలకు పట్టించి ఒక గంత తరువాత స్నానం చేస్తే జుత్తు అనూహ్యంగా పెరుగుతుంది.
- జుత్తు ఆరోగ్యంగా పొడవుగా పెరగాలంటే వారనికి ఒకసారి ఆముదం రాయాలి.
- వారానికి ఒకసారి టీ డికాషనుతో తలకి స్నానం చేస్తే జుత్తు ఒత్తుగా పెరుగుతుంది.
- నిమ్మకాయ గింజలు, మిరియాల మిస్రమం కలిపి జుత్తు తక్కువగా ఉన్న ప్రాంతంలో పట్టిస్తే జుత్తు పెరగడానికి అవకాశం వుంటుంది.
దన్యవాదములు...
To be continued...
Comments
vivek.
vivek.
mee tips chalabagunnayi