అందం నా హక్కు....కురుల సంరక్షణ-1
పాఠకులు అందరికి "విజయదశమి" శూభాకాంక్షలు.
శరీర సౌంధర్యనికి శిర:సౌంధర్యం తోడైతే ఆ మనిషి జన్మ ధన్యం అంటారు.కురులు ఇవి మనిషికి అత్యంత ప్రధానమైనవి కురులు లేని మనిషిని ఊహించగలమా! మనం నిత్యం చుస్తూనే ఉంటాం వీరి కురులు బాగున్నాయి, నాకు అలా లేవే అని భాధ పడుతుంటాం...
కురులకు సంబంధించిన వ్యాధులు, చుండ్రు సమస్య, రాలిపోవడం, పండిపోవడం, పగుళ్ళు, చిగుళ్లకు పోషణ కరువవ్వడం, కురులలో తేజస్సు లేకపోవడం మొదలగు కారణాలకు నివారణ మార్గాలను చూద్దాం...
చుండ్రుని నివారించడం ఎలా...!
- మంధార పూల రెక్కలను పేస్టులా చేసుకుని వాటి రసం తీసి ఒక గంట సేపు తలకు పట్టించి తరువాత చల్లని నీటితో లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రుని నివారించవచ్చూ.
- కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్ ,నిమ్మరసం కలిపి వేడిచేసి తలకు బాగా కుదుల్లావరకు పట్టించి ఒక గంట లేదా రెండు గంటలతరువాత స్నానం చేస్తే చుండ్రుని నివారించవచ్చు.
- వేడి కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి పదినిమిషాలు మర్దనా చేసి ఒక అరగంట తరువాత తలకు స్నానం చేయాలి.
- ఆముధం , మెంతి పొడి కలిపి తలకు మర్ధనా చెస్తే చుండ్రుని నివారించవచ్చు.
ధన్యవాధములు...
To be continued...
Comments
అరుణ.
vivek
one of your blog reader
vasundhara.