Posts

Showing posts from 2008

అందం నా హక్కు...గోటికి తప్పదు రక్షణ..

Image
ఇంతకు ముందు విభాగంలో "చేతులకు సంబందించి తీసుకోవలసిన జాగ్రత్తలు" చూసాం. మరి గోళ్ళకు కూడా తగినంత రక్షణ అవసరం. ఈ క్రింది విదంగా ప్రయత్నించి చూడండి. గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉండాలన్నా,గోళ్ళపై పసుపుదనం పోవాలన్నా నిమ్మచెక్కతో రుద్దాలి. బలమైన గోళ్ళు మీ సొంతం కావాలంటే ఒక వెల్లుల్లి రేకను తీసుకొని గోళ్ళపై రుద్దాలి. ఇలా తరచు చేస్తుంటే గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి. గోళ్ళకు ఆరోగ్యంగా పెరగాలన్నా, అందమైన ఆకృతిలో ఉండాలన్నా నెలకొకసారైనా "మెనిక్యూర్" చేయాలి. గోరు వెచ్చనినీటిలో 4-5 చుక్కల షాంపూ కాని, కొంచం సబ్బు కాని వేసి చేతులను 10-15 ని.// నాననివ్వాలి. తరువాత చేతులను బయటకు తీసి చేతులను, వేళ్ళను, గోళ్ళను మెత్తని బ్రష్ తో రుద్ది కడగాలి. క్యూటికల్ కటర్ తో గోరు చుట్టూ ఉండే డెడ్ స్కిన్ ను తొలగించాలి. క్యూటికల్ కటర్ విడిగా కొనుక్కోవచ్చు లేదా నెయిల్ కటర్ తో పాటు వచ్చే క్యూటికల్ కటర్ను వాడవచ్చు. ఇది నెయిల్ కటర్ చివర వంపు తిరిగి ఉండే సాదనం.దీనితో క్యూటికల్స్ కట్ చేసిన తర్వాత గోరు వెంబడి ఉండి గోరు మీద పరుచుకున్నట్ట్లు ఉండే చర్మాన్ని లోపలికి పుష్ చేయాలి. తరువాత గోరును అందంగా షేప్ కట్...

అందం నా హక్కు.... కోమలమైన చేతులకోసం.

Image
శరీరంలో ముఖం తరువాత అందరూ గమనించేది చేతులను. ముఖ్యంగా స్త్రీలు ఇంటి పనులు, వంట పనులు చేయడం వలన చేతులు చాలా కఠినంగా తయారవుతాయి. మరి చేతులను కోమలంగా తయారుచేసుకోవడానికి ఈ క్రింది చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించాలి. ఈ మిశ్రమం చేతులపై ఉండే మృత కణాలను, పొడి చర్మాన్ని తొలగించి చేతులను సున్నితంగా చేస్తుంది. ఒక గిన్నె లేక వెడల్పుగా ఉన్న పాత్రలో నీళ్ళు పోసి, దానిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముంజేతి నుండి భుజాల వరకు రాయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి. ఇల చేయడం వలన చేతులు మృదువుగా మారతాయి. అరచేతులు పొడిబారినట్టయితే రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో చేతులను, చేతి వేళ్ళను బాగా మర్ధనా చేయాలి. ఇలా చేయడం వలన చేతులకు వ్యాయామం కలిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దన్యవాదములు...

నన్ను చేరు నేస్తమా...!

Image
ప్రియ నేస్తమా! నా మౌనాల ఆరంభమా!! మమతలు మురిసే వేళ, ఆశలు చిగురించే వేళ, సూర్యుడు ఉదయించే వేళ, చంద్రుడు వెన్నెల పంచే వేళ, నీ రూపం చూసాను, పరవళ్ళు తొక్కాను, ఆనందించాను, మైమరచిపోయాను. నా స్నేహం స్వీకరిస్తావని, నాతో చేయి కలుపుతావని, కానీ నా కోర్కె తీర్చకుండానే వెల్లిపోయావు. ఇది నీకు న్యాయమా!! నేను జీవించేది నీ గురించి, అందుకే నాలో బాదను నీకు పంపుతున్న నా మది భిగించి, నా మనసు మారింది ముత్యంలా నిన్ను స్మరించి, నీకు అవుతా మంచి నేస్తంలా శిరసువంచి, నాకోసం రాలేవా ఈ దూరాన్ని ఇక తెంచి!! నీ నవ్వులో తెల్లదనం నా గుండెకు కలిగించే వెచ్చదనం, నీ చూపులో చల్లదనం నా మదికి కలిగించే పచ్చదనం, నీ మనసులో మంచితనం నా యదకు కలిగించే తడిదనం, నీ అధరంలో ఎర్రదనం నా హృదయానికి కలిగించే వెలుగుదనం, నీ స్నేహంలో చిలిపితనం నా ఊపిరికి కలిగించే సొగసుదనం. నువ్వు నన్ను చేరితే ...... నీలి మేఘాల సాక్షిగా నీ చూపునవుతా,నయగారాల సాక్షిగా నీ మాటనవుతా, నింగి చుక్కల సాక్షిగా నీ నడకనవుతా,నీ తోడు సాక్షిగా నీ నీడ సాక్షిగా నీ నీడను అవుతా!! వసంతం కోసం పక్షులు ఎదురు చూసినట్లు, వాన కోసం వాగులు ఎదురుచూసినట్లు, నీ కోసం ఎదురుచూస్తున్నా "ఆశగా...

అందం నా హక్కు....కురుల సంరక్షణ-VI.

Image
కురులకు సంబంధించి సంరక్షణ కలిగించే మరికొన్ని సులువైన,విలువైన మర్గాలు వీటిని కూడా ప్రయత్నించి చూడండి. కురులకు "జీవం పోయండి ఇలా"... పాల కూర ఆకులను గ్రైండ్ చేసి దానితో తల రుద్దుకుంటే నిర్జీవంగా ఉన్న జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది. కోడి గుడ్డు తెల్లసొన,రెండు స్పూన్ల ఆముదం,ఒక స్పూన్ గ్లిజరిన్ కలిపి తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తే తల నిగనిగలాడుతుంది. దోసె పిండిని జుట్టుకు పట్టించి 15 ని " తరువాత తలస్నానం చేస్తే నిగనిగలాడుతుంది. తాజా కొత్తిమీర రసం జుట్టుకు పట్టించడం వలన నిగారింపు వస్తుంది. కురులు సాఫ్ట్ గా మారాలంటే 5 స్పూన్ల తేనని తలకు పట్టించి 20 ని" - 30 ని " తరువాత శుభ్రపరచుకోవాలి. కురులు పట్టులా మారాలంటే?... వారానికి ఒకసారి కొబ్బరినీటితో తలరుద్దుకుని తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో తలంటుకుంటే కురులు పట్టులా మారుతాయి. వెచ్చటి కొబ్బరినూనెతో తలకు మర్దనా చేసి తరువాత తలకు వేడి నీటిలో ముంచిన టవల్ చుట్టి గంట సేపు ఉంచి తరువాత తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా మారుతుంది. ఉడికించిన మినగపప్పు, మెంతి ఆకులను రుబ్బి వారానికి 2-3 సార్లు తల కుదుళ్ళకు పట్టి...

అందం నా హక్కు.. శీతాకాలంలో చర్మ సంరక్షణ - II

Image
ఇంతకు ముందు విభాగంలో "అందం నా హక్కు.. శీతాకాలంలో చర్మ సంరక్షణ - II" లో "రోజ్ కోల్డ్ క్రీం" తయారి విధానం తెలుసుకున్నాం.ఇప్పుడు "రోజ్ హ్యాండ్ లోషన్ మరియు రోజ్ రూట్ వాటర్" తయారుచేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. రోజ్ హ్యాండ్ లోషన్: కావలసిన పదార్దాలు మరియు తయారి విధానం: పన్నీరు -3 టేబుల్ స్పూన్స్, గ్లిజరిన్-3 టేబుల్ స్పూన్స్, ఆల్కహాల్-3 టేబుల్ స్పూన్స్, నిమ్మ రసం-1 టేబుల్ స్పూన్, కమలా పండు రసం-1 టేబుల్ స్పూన్, వెనీగర్- 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ ఒక బోటల్లో వేసి బాగా కలియబెట్టాలి. అంతే "రోజ్ హ్యాండ్ లోషన్" రెడీ దీనిని ఏ సీజన్ లోనైనా వాడవచ్చు. "రోజ్ రూట్ వాటర్": కావలసిన పదార్దాలు మరియు తయారి విధానం: గులాభి మొక్క వేరును చిదిమి ఒక పాత్రలో వేసి తగినన్ని నీటిని వేసిమూత పెట్టి చిన్న మంట మీద ఒక గంట సేపు మరిగించాలి. చల్లారిన తరువాత ఆ నీటిని ఒక బాటిల్ లో వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని వాడుకోవచ్చు. ఇది జిడ్డు చర్మానికి బాగా పని చేస్తుంది. ఈవాటర్ ని ఒక కప్పు లోనికి తీసుకుని దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది. దన్యవాదములు...

ఓ జాలిలేని నేస్తమా... !

Image
ఈ విరహానికి అర్దం తెలిపేది నీవే కదా! ఈ ఎడబాటుకి భావం తెలిపేది నీవే కదా! తెలుపమా నా ప్రాణమా, కన్నె హృదయం విలవిలలాడుతుంది. చూపుమా ఓ నేస్తమా, కన్నె వయసు భాదలో అలపిస్తుంది. కనులకు తెలియని కావ్యాలే కదలుగా మారెలే, మాటలకందని ముత్యాలే మదురిమలాయెలే, ఎదురుగా ఉంటూ యెద బాద వినవా గీతమా, ఎదురై వచ్చి యదలోనే కొలువుండు సంగీతమా! కన్నులు తెరిస్తే జననం అని, కన్నులు మూస్తే మరణం అని, తెరిచి తెరియని కనులను చూపడం న్యాయమా! నిప్పుల వెంట తియ్యని వల, విషమును చిమ్మే కమ్మని కల, రెంటిని కలిపి ఒకదానిలా చూపడం ధర్మమా!! నిమిషానికి ఒకటైన నరకం చూపించి, మత్తు పన్నీటిలో తడిపేసావమ్మ, నడిసంద్రంలోన నావను గుర్తించి, కత్తిని గుండెలో గుచ్చేసావమ్మ, నిశిరాత్రిలో నా దివ్వెను అర్పించి, ప్రేమ మార్గాన్ని చెరిపేసావమ్మ , తారల మెరుపుల్లో నవ్వును తొలగించి, చీకటి కన్నీళ్ళను నేర్పించావమ్మ, కడగళ్ళ పంజరంలోనా, వడగళ్ళ వానను కురిపించి, చిరుజళ్ళు దర్శనంలోన, తడికళ్ళతో దీపం వెలిగించావు! పవనాల పరిచయంలోన, పయనాల దారులు చెరిపేసి, గమనాల హౄదయపు సడిలోన, నయనాలలోమెరుపును దించావు!! చివరికి నువ్వు... సాగవే, సాగవే సహనం లేని సాగరంలా... నిలిచావే, నిలిచావే ని...

అందం నా హక్కు.. శీతాకాలంలో చర్మ సం రక్షణ...

Image
ఈ శీతాకాలంలో కోల్డ్ క్రీంస్, మాయిశ్చురైజర్స్ ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక వాటిని ఉపయోగించనివారు (అంటే అవి పడకో లేక వాటివలన ఇతర చర్మ వ్యాధులు వస్తాయనే అపోహ ఉన్నవారు) ఉంటారు. ఇలాంటి వారి కోసం ఈ "రోజ్ కోల్డ్ క్రీం" ప్రయత్నించి చూడండి. రోజ్ కోల్డ్ క్రీం: కావలసిన పదార్దాలు: ఆలివ్ ఆయిల్-4 టేబుల్ స్పూన్స్, గులాభి రెక్కలు - తాజాగా ఉండేవి, బిస్ వ్యాక్స్ -1 టేబుల్ స్పూన్ (అన్ని ప్రముఖ దుకాణాలలో దొరుకుతుంది), స్వచ్చమైన నీరు- తగినంత. తయారు చేసే విదానం : ఆలివ్ ఆయిల్ ని బాగా మరిగించి దానిని ఒక గాజు సీసా/పాత్రలో వేసుకోవాలి. అందులో గులాభి రెక్కలను వేసి గాలిబయటకు పోకుండా మూత బిగించాలి. దానిని ఒక వారం రోజులు అలానే ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడపోసి గులాభి రెక్కలను వేరు చేయాలి. ఇప్పుడు గులాభి సుగంధం వెదజల్లే ఆలివ్ ఆయిల్ మిగులుతుంది. ఇప్పుడు మరొకపాత్రలో బీన్ వ్యాక్స్ తీసుకుని బాగా కరిగే వరకు వేడి చేయాలి. కరిగినాక సుగంధంకల ఆలివ్ ఆయిల్ ని కలిపి పాత్రను కిందకు దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత కొద్దిగా నీటిని కలిపితే "రోజ్ కోల్డ్ క్రీం" రెడీ. దీనిని ఒక బాటల్ లో నిల్వ చేసుకున...

అందం నా హక్కు....కురుల సంరక్షణ-v

Image
కురుల సమస్యలకు, కురుల వ్యాదులకు సంబందించి ఇంతకు ముందు విభాగాలలో చాలా రకాల ప్రకృతిసిద్ధమైన, ఔషదగుణాలు కలిగిన,విలువైన సలహాలను మరియు చిట్కాలను చూశాం. నేటి ఈ యాంత్రిక యుగంలో పెద్ద, చిన్న, యుక్తవయస్కులు, స్త్రీలు, పురుషులు అనే తేడాలు లేకుండా అందరు ఎదుర్కుంటున్న మరొక సమస్య "కురులు రాలిపోవడం, ఊడిపోవడం, చిట్లిపోయి పడిపోవడం మరియు తెగిపోవడం" . దీనికి నివారణా మర్గాలను చూద్దాం. సమయం దొరికినప్పుడల్లా, లేదా రాత్రి పడుకునేముందు "స్వచ్చమైన, మంచి నువ్వులనూనేతో లేదా కొబ్బరినూనెతో "తల నుండి కుదుళ్ళ వరకు మర్దనా చేయవలెను. 2 టేబుల్ స్పూన్ల మెంతులు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసి జుట్టు కుదుళ్ళకు పట్టించాలి. ఒక గంట తరువాత కుంకుడు లేదా శికాకాయతో స్నానం చేయాలి. వారానికి రెండుసార్లు పెసరపిండిలో పుల్లటి పెరుగు కలిపి తలకు రుద్దుకొని 30-60ని//.ల తరువాత తలకు స్నానం చేయాలి. ఒక టేబుల్ స్పూన్ తాజా ఉసిరికాయల రసంలో(కొండ ఉసిరి), ఒక టీ స్పూన్ బాదం నూనే, ఆర టీస్పూన్ నిమ్మరసం కలిపి వారానికి ఒకసారి తలకు స్నానం చేయాలి. కలబందను రెండుగా చీల్చి మద్యలో ఉలవలను పెట్టి గట్టిగా కట్టేయాలి. ...

అందం నా హక్కు....

Image
కాలం, ౠతువులు ఏప్పుడు ఒకేలా ఉండవు. మరి మనం కూడా కాలనికి తగినట్టు మన సౌందర్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. చర్మ సౌందర్యం కాపాడుకోడానికి కొన్ని ప్రకృతిసిద్దమైన చిట్కాలు. ఒక కప్పు పెసరపిండిలో అర టీ స్పూన్ పచ్చిపసుపు,9-10 స్పూన్ల బాదం నూనే కొద్దిగా నీళ్ళు వేసి పేస్టులా కలుపుకోవాలి.ఈ పేస్టుని పలుచని పొరలా శరిరానికి పట్టించాలి.పుర్తిగా ఆరిన తరువాత మెల్లగా రుద్దుతూ వదిలించి ఆ తరువాత స్నానం చేయాలి. పచ్చి బంగాళదుంపను చక్రాలుగా కోసి ముఖంపైన రుద్దితే మచ్చలు, గీతలు పోతాయి. పచ్చి పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తరువాత కడగాలి. ఇది సహజసిద్దమైన బ్లీచ్.చర్మాన్ని తెల్లబరుస్తుంది. ఎండకు కమిలిన చర్మాన్ని తిరిగి యధాస్తితికి తెస్తుంది. కమలపండు తొక్కలను ఎండబెట్టి పొడిచేసి దానిలో పెరుగు కలిపి ముఖానికి పట్టించి 15 ని//. తరువాత కడిగితే ముఖంపైన మచ్చలు పొయి ముందు లేనంత కళ వస్తుంది. తేనె చర్మానికి మృదుత్వాన్ని, మెరుపుని ఇస్తుంది, ముడతలను తగ్గిస్తుంది. కాబట్టి ఏ ప్యాక్ లోనైనా 3-4 చుక్కల తేనె కలుపుకోవచ్చు. కీర రసం సహజమైన ఆస్త్రింజెంట్, ఇది చర్మానికి మృదుత్వాన్నివ్వడంతో పాటు అదనంగా ఉన్న జిడ్డున...

పొద్దు పొడిచింది...!

Image
రోజులు మారినా నీ రూపం మారదు ...! కాలాలు మారినా నీ కలలు మారవు...! ఋతువులు మారినా నీ రాగాలు మారవు...! గగనాలు మారినా నీ గానాలు మారవు....!నిమిషాలు మారినా నీ నయనాలు మారవు...! తేదీలు మారినా నీ తలపులు మారవు...! ఏమిటండి అందరు ఇదేదో ప్రేమ కావ్యం అనుకుంటున్నారా! కాదండి ఇది ఒక జీవిత నిత్య సత్యం! ప్రతి నిత్యం మన జీవితాల్లో దేని కోసం ఎదురుచూస్తున్నామో అదే ఈ "పొద్దుపొడిచింది". మనుష్యులలో ఆలోచనా విదానం ఒకేలా ఉండదు. ఇది అందరూ అంగీకరించే నిజం అవునుకదండీ...! అప్పటివరకూ చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా, నిశబ్దంగా ఉన్న ప్రపంచాన్ని తన వాలు చూపులు అనే కిరణాలతో రెచ్చగొడుతూ నిశిరాత్రిలో పవళిస్తున్న వారిని తన చిలిపి చేష్టలతో ఓలలాడిస్తున్న వెన్నెల శరీరం నుండి గాలి వేగంతో దూసుకెళుతూ, కటిక చీకటి అనే కలలు తెరలను మేలుకొలుపుతూ నేను వస్తున్నా పట్టించుకోరే లెగండీ... లెగండీ...! అంటూ మనల్ని మేలుకొలుపుతుంది వేకువ అనే అరుణ కిరణం. మరి ఆ లోక చక్రాదిపతి పడుతున్న వేదన ఇది... ఈ లోకంలో కృత్రిమంగా తమ శరీరాలకు మెరుగులు దిద్దుకుని తమ హొయలను ఎదుటివారికి చూపించి అన్ని విధాలుగా వారిని కించపరుచుతూ తామే అన్ని రంగాలలో, అన్ని విషయల...

అందం నా హక్కు....కురుల సంరక్షణ-IV.

Image
కురుల సంరక్షణకు సంబందించి ఇంతకు ముందు విభాగాల్లో కొన్ని మంచి చిట్కాలు చూసాము.మరి కాలానికి తగ్గట్టుగా కురులను సంరక్షించుకోవలసిన భాద్యత కూడా మనదే...! మరి ఆ చిట్కాలను కూడా చూద్దాం.. కాలానికి తగినట్టుగా కురుల సంరక్షణ... వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా తడుస్తుంది.త్వరగా ఆరుతుంది కదా అని డ్రయ్యర్ తో ఆరబెట్టకూడదు.అలా చేయడం వలనా వెంట్రుకలు చిట్లిపోయేఅవకాశం వుంటుంది.మెత్తని బట్టతో తలను తుడిచి వీలయితే నిప్పులతో ఆరబెట్టుకోవాలి. వర్షాకాలంలో పగటివేల ఎటువంటి నూనెలు తలకు రాయకుండా ఉండడం మంచిది నూనె వలన ముఖ:మంతా జిడ్డుగా అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎండా, దుమ్ము,ధూలీ వలన జుట్టు రాలిపోతుంటే & జీవం లేనట్టు కనిపిస్తే ఒక కప్పు పాలలో ఒక కోడి గుడ్డు సొన కలిపి తలకు పట్టించి 30 నిమిషముల తరువాత శుభ్రపరుచుకోవాలి. చలికాలంలో జుట్టు పొడిగా ఉంటే ఆలివ్ ఆయిల్ గోరువెచ్చగా చేసి దానితో మర్దనా చేసుకోవాలి. జుట్టు మరీ జిడ్డుగా ఉంటే నువ్వుల నూనెతో మర్ధనా చేసుకుని గంట తరువాత శుభ్రపరుచుకోవాలి. కురులకు "కండీషనర్"... జుట్టు ఆరొగ్యంగా పొడవుగా పెరగాలంటే వారానికి ఒకసారి ఆముదం రాయాలి. వారానికి ఒకసారి టీ డికాషనుతో తల స్నానం చేస్...

**..దీపావళి శూభాకాంక్షలు..**

Image
అందరికి నమ: సుమాంజలి... ! వీక్షకులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు , నా రచనలను ఆదరిస్తున్నవారికి, బ్లాగ్ లో అందరి సభ్యులకు, మా తప్పులను సరిచేస్తూ మా రచనలకు కామెంట్స్ ఇస్తున్నవారందరికి "దీపావళి" శూభాకాంక్షలు. ఈ దీపావళి రంగుల కాంతులు మీ అందరి జీవితాల్లొ వెలుగులతో కూడిన మరియు సుఖసంతోషాలతో నిండిన సౌభాగ్యాలతో నిత్యనూతనంగా కలకాలం వెలిగొందాలని ఆకాంక్షిస్తూ..... మీ శ్రీసత్య...

దరి చేరుకో నేస్తం.....

Image
మనసులోని మాట బయటకు వచ్చేనమ్మా!తేనేలోలుకు పాట సెదతీరెనమ్మ!! ఏందుకో తెలియని తనతో మది ఉగిసలాడుతుంది.అడగరానిది కోరుతు యద భారమవుతుంది. కనులకు తెలియని కలలతో నిద్ర చంపుతుంది. ఆశ ఎరుగని తనువు ఆత్రంతో ఎదురుచూస్తుంది.. అందరాని ద్యాశతో అడుగుతున్నా... పొందరాని ఉహతో పొంచిచూస్తున్నా.... కలలా అలలతో నన్ను తదుపుమా,నాకు కన్నీల్లు మిగల్చకుమా! మంచు కడలిలో నన్ను చూడుమా నాలో భ్రమలా మిగలకుమా!! మెరుపు వెలుగువై నన్ను తాకుమా,నాలో ఆరని జ్వాలను రేపకుమా! వెన్నెల రాత్రి నన్ను చేరుమా, నాలో చికటి ఇక పెంచకుమా!! నిన్ను ప్రేమిస్తా నా గుండెగా, నిన్ను పుజిస్తా నా ప్రాణంగా, నిన్ను నవ్విస్తా నా మాటగా, నిన్ను లాలిస్తా పసి పాపగా, నువ్వు నన్ను చూసేదాక వేచుంటా ఎన్నాళైనా, నువ్వు నన్ను చేరేదాక ఆగివుంటా ఎన్నేళైనా, చివరిగా, కరుణించి అందుకో నా స్నేహం! దయచేసి నువ్వు చెరపాలి ఈదూరం!! దన్యవాదములు...

కడుపులో కన్నీళ్ళను ఎందుకు దాచుకోవడం...?

Image
మనం ప్రాణంగా ఇష్టపడే వాళ్ళు మన తప్పు లేకుండా మననుండి విడిపోదామనుకుంటే ఆ బాదా,కష్టం మనసు లేని వారికైనా వస్తుంది.అ క్షణంలో ఏదోఒకటి చేసుకోవాలి అనిపిస్తుంది. మరి భరించలేనపుడు చచ్చిపోవాలి అనిపిస్తుంది.కాని అ సమయంలో కూడా పిచ్చిమనసు అవతలి వారి గురించే ఆలోచిస్తుంది.విడిపోవడం బాహ్యంగానే అయిన వారి ఙ్నపకాలు ఎప్పటికి తీపిగురుతులుగానే మిగిలిపొతాయి. కాని మళ్ళి భవిష్యత్తులో దేనినైన పొగొట్టుకునేటప్పుడు మాత్రం బాదా అనేది చాలా భయంకరంగా ఉన్న ఆ బాదాను చుపే కన్నిళ్ళు మాత్రం కడుపులొనే ఉండిపొతాయి. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్తితులు అలాంటివి.పరిస్తితులు పాముల్లా మన చుట్టూ ఉండి సూటి,పోటి మాటలాతో కాటెస్తాయెమో అనే భయం.అందుకే "కన్నీళ్ళను కూడా కలల్లా ఆ సమయంలో కరిగిపోమంటుంది మనసు" . నిజమే! కాని జరిగిన తప్పులు ఎన్నైన,జతను వీడిన మనుషులు ఎవరైనా అది మన మంచికే అనుకుంటే అది కొంతకాలం తరువాత మానడానికి అవకాశం ఉంటుంది.కాని కొన్ని విషయాలు ఎంత మరచిపోదామన్న మరపురాదు. ఎందుకంటే గతం మన నీడవంటిది.ఏదుటివారితొ ఏమ్మాట్లాడుతున్న, ఏంత సంతోషం నటించినా అవతలి వ్యక్తి మనపై ప్రేమ చుపించినపుడుడల్లా గుర్తుకు వస్తుంది గతంలో చేజారిన క్ష...

అందం నా హక్కు....కురుల సంరక్షణ-III

Image
నేడు ఎక్కువగా మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఎదుర్కుంటున్న చాలా పెద్ద సమస్య "జుత్తు తెల్లగా మారడం" .ఈ ఆధునిక ప్రపంచంలో వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న సమస్య ఇది.మరి దీనికి నివారణ మర్గాలను చూద్దాం. మెదటిగా ప్రతి ఒక్కరు చెయ్యాల్సిన పని "టీ,కాఫి,డ్రింకింగ్,మసాల పదార్దాలు మొ//" తినడం కాస్త తగ్గించాలి. ఒక స్పూన్ కర్పూరం పొడిని, కొబ్బరినూనేలొ కలిపి ప్రతి రెండు రోజులకు ఒక్కసారి మసాజ్ చేసుకోవాలి. మల్లెతీగ వేళ్ళని, నిమ్మరసంలో కలిపి గ్రైండ్ చేసి తలకుద్దుళ్ళ వరకు పెట్టి 30ని//.ల తరువాత శుబ్రపరచుకోవాలి. తలస్నాననికి వీలైనంతవరకు కుంకుడు కాయలు, శీకాకాయలను ఉపయోగించడం ఉత్తమం. అవి లభించనప్పుడు తక్కువ గాఢతగల షాంపూలను,హెర్బల్ షాంపూలను ఉపయోగించడం మంచిది. కోబ్బరినూనేలో కాస్త నిమ్మరసం కలిపి వేడిచేసి ప్రతి రోజూ పడుకునే ముందు మసాజ్ చేసుకుంటే మంచిది. తలస్నానం చేసినాక చేతివేళ్లతో కుదుళ్లకు మసాజ్ చేసుకుంటే బ్లెడ్ సర్కులేషన్ పెరిగి కురులు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఉసిరికాయలను ముక్కలుగా చేసి అందులో పిక్కలను తీసి బాగా ఎండబెట్టి, ఆవునేతిలో వాటిని వేయించి రోజూ తింటుంటే తెల్ల జుత్తు ...

ఎక్కడికి ఈ పయనం...!

రోజుకు 24 గంటలు కానీ, మనిషి ఆలోచనలకి ఎన్ని గంటలు ఉన్నా సరిపోదు, అని సరిగ్గా గుర్తులేదు కానీ ఎక్కడో నా చిన్నప్పుడు చదువుకున్నాను... ఇది నిజం కాదంటారా!! నిజమే నేమో ఎందుకంటే నేను కూడా ఒక మనిషినేగా...! నాకు అలనే ఆనిపిస్తుందీ... అది ఒక చల్లని సాయంత్రం వేళ కారు మబ్బులు గగనంలో స్వేచ్చగా విహరిస్తూ, అవి ప్రయాణించినందుకు ఇంధనరూపంలో స్వాతి చినుకులను మెల్లగా విరజిమ్ముతూ, ఇదిగో, నా పైన ఎందుకు పడుతున్నారు వద్దువద్దు అంటూ నేల తల్లి అంటున్నా వినకుండా పడుతున్నాయి, ఆ నంగనాచి చినుకులు చూడు అని నాకు చెప్పడానికి గమ్మత్తుగా తన మట్టి సుగందం వెదజల్లుతున్న వేళలో ఒక వాలుకుర్చిలో కూర్చోని అలోచించాను. నేను ఈ దేహాన్ని ఎందుకు పొందాను. ఎందుకు నాకు ఈ జీవితం ఆ దైవం ఇచ్చాడు అని. తమకు ఎదురులేదని, మమ్మల్ని ఎవరు ఆపలేరని విర్రవీగే నీటి అలలను అడిగి చూసాను సమాధానం దొరకలేదు...! తన బంగారు ఛాయతో దేనినయినా నాకు దాసోహం చేసుకోగలను అని తన అహంకారాన్ని చూపే అగ్నికిలల్ని అడిగి చూసాను సమాధానం దొరకలేదు...! నవగ్రహలలో అధిపతి ఆ సూర్య భగవానుడైన జీవకోటికి ఆశ్రయమిచ్చెది నేనే అని చెప్పుకుంటూ వస్తున్న ధరని తల్లిని అడిగి చూసాను సమాధానం దొరకలేదు...

అందం నా హక్కు....కురుల సంరక్షణ-II.

Image
నల్లగా, నిగనిగ లాడుతూ, త్రాచుపాములా మోకాళ్ళ దాక వున్న కురులంటే ఏవరికి మాత్రం "ఇష్టం" ఉండదు. ఇలాంటి మహిలలకొసమే ఈ మద్య "వాలుజడల పోటీలు" నిర్వహిస్తున్న సంస్థలు పెరుగుతున్నాయి. దినిని బట్టి కురులకు నానాటికి ఎంత క్రేజ్ పెరుగుతుందో తెలుస్తుంది.మరి అలాంటి కురులు కావాలని అనిపిస్తుంది కదా! మరి అలాంటి "పొడవైన,ఒత్తైన,ఆరోగ్యకరమైన కురుల కోసం " ఏం చెయ్యాలో చూద్దాం. మందార పూల రెక్కలను తుంచి కొబ్బరి నూనెలో వేసి మరిగించి, రోజు తలకి రాసుకుంటే కురులు పొడవుగా పెరుగుతాయి. కుంకుడు కాయ రసంలో మందార ఆకులు పేస్ట్ కలిపి తలకి స్నానం చేస్తే చుండ్రు తగ్గి జుత్తు పొడవుగా పెరుగుతుంది. మందారపువ్వుల రేకుల్ని జుత్తు రాలిన చోట రుద్దితే ఆ ప్రదేశంలో తిరిగి జుత్తు రావడానికి అవకాశముంటుంది. కనుబొమ్మలకు కూడా... మందార పువ్వులను కానీ ఆకులను కానీ పేస్ట్ చేసి తలకు పట్టిస్తే చుండ్రు, దురదా తగ్గి వేడి కూడా తగ్గుతుంది. మందార ఆకుల పొడి - 3 టేబుల్ స్పూన్స్ , తేనె-3 టేబుల్ స్పూన్స్ , కలబంద గుజ్జు - 6 టేబుల్ స్పూన్స్ వాటికి తగినన్ని కొబ్బరి పాలు వేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించి 30 నిమిషాల తరువాత తలకు స్నా...

ఆశలు మిగిల్చే కన్నీళ్లు...

మనిషి ఆశాజీవి .తనకి ఎన్ని కోరికలు, ఆశలు తీరినా మరలా క్రొత్త క్రొత్త ఆశలు పుట్టుకొస్తాయి. ఒక రోజున్న అభిరుచులు, అలవాట్లు మరొక రోజు ఉండవు. అందుకనే నేమో! మనం మనుషులుగా పుట్టాం!! అప్పటి వరకూ అమ్మానాన్నలకు కూడా తెలియని, మిత్రులు, శ్రెయోభిలాశులకు కనిపించని, ప్రకృతిలో పంచభూతాలకు కానరాని ఒక క్రొత్త రూపం నేను మీతో పాటే ఉండాలని కోరుకుంటున్నాను, అంటూ అమ్మ కడుపులోనుండి అనేక ఆశలతో, కోరికలతో , అభిరుచులతో నెలలు నిండకుండానే ఎంత త్వరగా ఈ లోకంలోకి వచ్చేదాం...., ఈ ప్రపంచ అందాలను చూసేద్దాం...., అందరి ప్రేమలను, ఆప్యాయతలను ఆస్వాదిద్దాం...., క్రొత్త స్నేహాలతో తన చనువు పెంచుకుందాం......! అనుకుంటూ క్రొత్తగా, సరిక్రొత్తగా ఈ సృష్టిలోకి తెరిచీ తెరవని కన్నులతో, నేనూ మీలో మనిషినే అనుకుంటూ గట్టిగా శబ్దం చేసుకుంటూ అడుగు పెడుతుంది పసి కందు "తనకే తెలియని ఆశలతో". నిజానికి పుట్టగానే తనకే తెలియదు, ఎన్ని ఆశలతో ఈ లోకంలో అడుగు పెట్టిందో, కానీ అప్పటికే తనపై ఎన్నో కళ్ళు చాలా ఆశలతో ఎదురుచూస్తుంటాయి. పుట్టే బిడ్డ ఎలా ఉంటుందా అని ఇక్కడితో మొదలైన జీవనయానం(ఆశలరూపం) తీరం చేరేవరకు ఎదురుచూస్తూనే ఉంటుంది, ఆశల సాకారం ...

అందం నా హక్కు....కురుల సంరక్షణ-1

Image
పాఠకులు అందరికి "విజయదశమి" శూభాకాంక్షలు. శరీర సౌంధర్యనికి శిర:సౌంధర్యం తోడైతే ఆ మనిషి జన్మ ధన్యం అంటారు.కురులు ఇవి మనిషికి అత్యంత ప్రధానమైనవి కురులు లేని మనిషిని ఊహించగలమా! మనం నిత్యం చుస్తూనే ఉంటాం వీరి కురులు బాగున్నాయి, నాకు అలా లేవే అని భాధ పడుతుంటాం... కురులకు సంబంధించిన వ్యాధులు, చుండ్రు సమస్య, రాలిపోవడం, పండిపోవడం, పగుళ్ళు, చిగుళ్లకు పోషణ కరువవ్వడం, కురులలో తేజస్సు లేకపోవడం మొదలగు కారణాలకు నివారణ మార్గాలను చూద్దాం... చుండ్రుని నివారించడం ఎలా...! మంధార పూల రెక్కలను పేస్టులా చేసుకుని వాటి రసం తీసి ఒక గంట సేపు తలకు పట్టించి తరువాత చల్లని నీటితో లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రుని నివారించవచ్చూ. కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్ ,నిమ్మరసం కలిపి వేడిచేసి తలకు బాగా కుదుల్లావరకు పట్టించి ఒక గంట లేదా రెండు గంటలతరువాత స్నానం చేస్తే చుండ్రుని నివారించవచ్చు. వేడి కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి పదినిమిషాలు మర్దనా చేసి ఒక అరగంట తరువాత తలకు స్నానం చేయాలి. ఆముధం , మెంతి పొడి కలిపి తలకు మర్ధనా చెస్తే చుండ్రుని నివారించవచ్చు. పై చిట్కా...

చేజారిన "రోజా పువ్వు"...

ఒక రోజా పువ్వు..., అది ఏన్నో ఆశలతో ఈ లోకంలోకి అడుగు పెడదాం అనుకుంది.కాని అది రాకముందునుండె దానిపై ఏన్నోచూపులు. కొందరు ప్రేమతో దాని సౌంధర్యంచూసి ఆనందించెవారైతే! కొందరు దానిని తురిమి కురులలో పెట్టుకుందామనుకునేవాల్లు!! కొందరు దానిని తమ ఇష్టదైవానికి సమర్పించాలనుకునేవారైతే! ఇంకొందరు దానిని ఎవరి కంటాపడకుండా దాచేయాలనుకునేవాల్లు!! కాని పాపం ఆ రోజాకేమి తెలుసు తాను విరబూయకముందు... ఏ చూపులు తనను స్వాధినపరుచుకోవాలనుకుంటున్నాయో, ఏ చేతులు తనను తుంచబోవాలనుకుంటున్నాయో, ఏ కురులు తనను అలంకరించుకోబోతున్నాయో, ఏ దైవం తన సుగంధరేణువులను ఆస్వాదించబోతున్నాయో..... ఇవి ఏవి తెలియకుండా తను ఈ ప్రపంచనికి స్వేచ్చగ,ఆనందంగా,సంతోషంగా,ఉల్లాసంగా తన అంత:ర్సౌంధర్యన్ని చూపిద్దామనుకుంది. చడి చప్పుడు లేని,ప్రళయాలకి కోలువుకాని,ప్రశాంత వాతవరణంలో ఒక నిశిరాత్రివేళ తన అందం విరబోసేలా,లోకమంతా రెప్ప వేయకుండా చూసెలా,చిలిపిమనసులు తల్లడిల్లేలా,కన్నేహృదయాలను కోల్లగొట్టేలా,లోకానికి వేలుగునిచే సూర్యుడు కూడ తలదించుకునేలా, ఏర్రని కాంతులతో విరభూసింది. "తన అందాన్ని చూసి తానే ఆశ్చర్యపొయింది,ఆందరి వాలు కనుల చూపులకు సిగ్గులతో మురిసిపొయింది...

అందం నా హక్కు....చర్మ సౌందర్యం కాపాడుకోండిలా.

శరీరతత్వం ఒక్కొకరికి ఒకల ఉంటుంది.ఐతె కొంతమంది ఇవి గమనించకుండా బయటి ప్రక్రియలకు అలవటుపడి వృధాగ వారి శ్రమను,కాలనీ,సంపదను వ్యర్ధం చేసుకుంటున్నారు.ఇల ఏదుటి వారి బలహీనతల్ని డబ్బు చేసుకునేవాల్లు చాలమంది పెరిగిపొయరు.మనకు అందుబటులో ఉండె పదార్ధలతొ మనకు మనమే చెసుకునే చక్కని చిట్కలు చూద్దాం. జిడ్డు చర్మానికి: చల్లని మంచి నీటితొ ముఖాన్ని ప్రతి రెండు గంటలకు ఒకసారి కడగడం వలన ముఖంపైన ఉన్న మలినాలు ఏప్పటికప్పుడు పొతాయీ।మరి జిడ్డుగా వుంటె ముఖాన్ని కడిగిన తరువాత ఐస్‌క్యుబుతొ రుద్ధుకొవాలి. ధ్రక్ష రసం,నిమ్మ రసం,కొడిగుడ్డు తెల్ల సొన కలిపి ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిన తరువాత చల్లని మంచి నీటితొ కడగాలి. ఒక టేబుల్ స్పూన్ తేనెలొ,ఒక కొడిగుడ్డు వేసి బాగ కలిపి ముఖానికి,మెడకు రాసుకొని ఆరిన తరువాత కడుగుకోవాలి. పొడి చర్మానికి: నిమ్మ రసంలొ పాలు కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని రుద్ది 20 ని//లా తరువాత చల్లని మంచి నీటితో కడుగుకోవలి. తేనెలొ నిమ్మరసం,వెజిటేబుల్ ఆయిల్ కలిపి ముఖానికి పటించి 20 ని//లా తరువాత గోరువెట్చనీ నీటితో కడుగుకోవలి.ఇది మాయిశ్చరైజెర్లా పనిచేస్తుంది। ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో,రెండు టేబుల్ స్పూన్లా పాల మ...

నీ వలనే ఈ మాయ...

ప్రేమ,దీనిగురించి ఎంత చెప్పిన తక్కువె.అలంటి ప్రేమంటే లేత హృదయాలకు సంబరమె.ఒక్కసారి ప్రేమ పుడితే వారిలొ కలిగె అలజడి ఏవిధంగ ఉంటుందో చెప్పడానికి మాటలు సరిపొతాయా! అలంటి ఒక ప్రేమ గువ్వ తనలొ కలిగిన అలజడిని ఈ విధంగా వర్నించుకుంటుంది. ఓ నేస్తమా, పున్నమి చండ్రుడ్ని అమవాస్య పూనినట్లు, మండె సూర్యుడ్ని సూర్యకిరణం ఆపినట్లు, నీలి మేఘాల్ని కారుమబ్బులు కమ్మినట్లు, పిల్లకాలువను వానవరద ముంచినట్లు నా మనసుకు ప్రేమగాలి సొకింది।కారణం తెలియదు కాని దీనివలన నా మనసుకు తెలియని భారం పెరిగింది। ఈ మర్పు నాలొ క్రొత ఉత్స్తహం నింపింది.ఆకాశాన్ని జయించినట్లు,కాలన్ని ఆపెసినట్లు,భూమిని మొత్తంగా చుట్టెసినట్లు,నీటిపై కలవరం లేకుండ నడిచేసినట్లు అనిపించింది. ఇది నీ మాయ! లేక నీ ప్రేమ మాయ!! ఇది యే మాయ అయిన నాతొ కలకలం ఉండాలని దీవించు నేస్తం!ఏందుకంటె అ వేదనలో కుడ నువ్వు అందంగనే కనబడుతున్నవు!!. ధన్యవదములు...

అందం నా హక్కు ..... "బ్లాక్‌హెడ్స్,ముడతలు & మచ్చలు" పోగొట్టుకోండి .

నేటి స్త్రీకి మన సమజంలొ యేంత గౌరవం వుందొ మనకు తెలుసు. పురుషుడితొ సమానముగ స్త్రీ కుడ పొటి పడె స్థయికి వచ్చారు. ఒక అమ్మగ, ఒక ప్రేయసిగ, ఒక భర్యగ, ఒక కోడలిగ, ఒక అడపడుచుగ తన భద్యతలు నెరవేరుస్తు పనిచేసె చోట,పని కల్పించే చోట మన ప్రపంచంలొ స్త్రీకి ప్రముఖ స్థనం వుంది.అలంటి స్త్రీ సౌంధర్యం కపాడుకోవలసిన బాధ్యత తన చెతుల్లోనే వుంది. అలాంటి కొన్ని సౌంధర్య కనుకలు నేటి నుండి చుద్దం. వీటికొసం మీరు పార్లొర్స్కి, లేద బ్యూటిషీయీఅన్స్ దగ్గరకు వెల్లి మీయొక్క విలువైన కాలన్ని,శ్రమని, అతి విల్లువైన మీ సంపదను వృధ చేసుకోనవసరం లేదు. ప్రకృతి ప్రసాధించిన,ఇల్లలోనే వుండే అతి సులువైనా మార్ఘలద్వార తెలుసుకుందాం. స్త్రీలు నేడు యెదుర్కుంటున్న ప్రధాన సమస్య "బ్లాక్‌హెడ్స్,ముడతలు & మచ్చలు" వీటిని ఎలా నివారించ్చవచ్చొ కొన్ని అతి సులభ మార్గాలద్వార చూద్దం. టిప్-1 : కొద్దిగ మొక్కజొన్నపిండిలొ కొడిగుడ్డులొని తెల్లసొన కలిపి ముఖనికి పేక్ లా వేసుకోవలి. అది పూర్తిగ ఆరిన తరువాత గొరువెచ్చని నీటితొ మొత్తం పొడి పొయేల కడుగుకొవాలి.ఇల మూడు రొజులకి ఒకసరి చెస...

అమ్మ అంటే చులకన భావం ఎందుకని?

నా ఈ బావుద్వేగం ఎవరిని వుద్దెసించినది కాదు. కాని ప్రతి నిత్యం జరుగుతున్న నమ్మలెని నిజాలు. ఈ సృష్టికి ప్రాణం పోసేది అమ్మ, ఈ లోకానికి జీవనమిచ్చేది అమ్మ. మనకీ ఉపిరి పోసి,జీవం ఇచ్చి, జీవితాన్ని ఇచ్చే అమ్మ అంటే ఎంతమంది కి ఈ లోకంలో నిజంగ ప్రేమ ఉంది. నేటి యువత తమ ప్రేమను,మూడు నెలల క్రితం వచ్చిన వాళ్ళపైన చూపించినట్టుగా. చిన్నపటి నుండి ఏంటో శ్రమతో అల్లారుముద్దుగా పెంచిన తల్లి పైన ఎందుకు చూపలేకపోతున్నరు. రోజూ పొద్దున్న లేవగానే ఫోన్ తీసి మరి తన ప్రేయసికి, ప్రేమికుడికి, ఉపాధ్యాయులకు, తెలిసిన వాళ్ళకి, తెలియనివాళ్ళకి, "GOOD MORNING" చెప్పేవారు. తనని, తన తప్పుల్ని క్షమించి తన కడుపులోనే దాచుకునే తల్లికి ఎందుకని చెప్పలేరు. ఈ ప్రశ్నకి జావాబు ఏవరైనా, ఏప్పుడైనా ఆలోచించారా.మాతృమూర్తి గురించి ఎంత చెప్పిన తక్కువేగ. మరి ఎందుకు ప్రేమికుల రోజంటే నెల, రెండు నెలల నుండి ఎప్పుడు ,వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూసే నేటి యువత మరి ఎందుకని "MOTHERS DAY" అంటే చులకన బావం. అమ్మకి ఒక మనసుంటుంది తానూ కుడా ఒక మనిషె అని ఎంతమందికి ఆలోచిస్తూన్నారు. తనకి కూడ బాదా, సంతొషం ఇలా అన్ని ఉంటాయని ఎందుకు అర్ధం చేస...

నా గురించి

నీను ఇ తెలుగు బ్లొగ్స్ లొ నూతనంగ చెరిన సభ్యుడను. నా పేరు "శ్రీనివాసు". నీను "విశాఖపట్నం" వాసిని. నేను నా "కవితల సముహన్ని" త్వరలొ ఈ బ్లొగ్స్ ద్వర ప్రచురించనున్నను. నా కవితలను మీరు అదరిస్తరని అసిస్తున్నను. నా కలం పేరు "శ్రీసత్య". ధన్యవదములు మీ శ్రీనివాసు